ఆంధ్రప్రదేశ్‌

తీరానికి తిరుగుండదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పెరుగుతున్న అవసరాలను గమనించి కోస్టు గార్డ్ స్టేషన్‌ను మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ కోస్టు గార్డ్ రీజియన్ (ఈస్టు) కమాండర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్.పి.శర్మ వెల్లడించారు. 2019 నాటికి కోస్టుగార్డు 150 నౌకలు, 100 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. విశాఖలోని కోస్టు గార్డు జెట్టీ వద్ద సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నిజాంపట్నంలో కోస్టు గార్డ్ స్టేషన్ ఉన్నప్పటికీ అక్కడ నౌకలను నిలిపేందుకు అనువుగా సముద్రం లోతు లేకపోవడంతో ఆ స్టేషన్‌ను మచిలీపట్నానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ సముద్రపులోతు నౌకలను పార్క్ చేసేందుకు వీలుగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. మచిలీపట్నం ప్రాంతం కూడా వేగంగా అభివృద్ధి చెందే వీలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి విశాఖ కేంద్రంగా మరో నాలుగు నౌకలు తీర రక్షక దళంలో చేరనున్నట్లు తెలిపారు. 2019 నాటికి తీర రక్షక దళంలో 150 నౌకలు, 100 విమానాలు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ పరిధిలో 33 కమిషన్డ్ నౌకలు, 11 నాన్-కమిషన్డ్ నౌకలు ఉన్నాయని తెలిపారు. విశాఖలో తీర రక్షక దళానికి సంబంధించిన విమానాలు, హెలికాప్టర్లను నిలిపేందుకు వీలుగా ఎయిర్ ఎన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో తమకు కేటాయించిన స్థలాన్ని వివిధ అవసరాల నిమిత్తం పోర్టు ట్రస్టు తీసుకుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని కోరామని తెలిపారు. 12 నుంచి 16 ఎకరాల స్థలం కావాలని ఉంటుందని తెలిపారు. 16 విమానాలు కలిగిన ఒక స్క్వాడ్రన్ ఇక్కడ ఉంచవచ్చని తెలిపారు. తొలిదశలో రెండు విమానాలు ఉంటాయని తెలిపారు. ఎయిర్‌పోర్టు అథారిటీ స్థలానికి ఆనుకుని ఒక స్థలాన్ని గుర్తించామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకినాడలో కూడా ఒక జెట్టీ ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు.
తీర రక్షక దళంలోకి ఐసిజిఎస్ అర్నవేష్
తీర రక్షక దళంలోకి ఐసిజిఎస్ అర్నవేష్ నౌకను లాంఛనంగా విశాఖలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ ప్రారంభించారు. ఫాస్ట్ పెట్రోల్ వెస్సల్‌గా వ్యవహరించే ఈ తరహా నౌకల్లో పదహారవ నౌక. కొచ్చిన్ కోస్టు గార్డ్ పూర్తిగా దేశీయ పరిజ్ఞానంలో నిర్మించిన నౌక ఇది. అత్యాధునిక నేవిగేషనల్, కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది. దీనికి కమాండింగ్ అధికారిగా కమాండెంట్ అమిత్ ఉనియాల్ వ్యవహరిస్తున్నారు.
chitram...
ఐసిజిఎస్ అర్నవేష్ నౌక వద్ద గౌరవ వందనం స్వీకరిస్తున్న తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్