రాష్ట్రీయం

విజయదుర్గకు బెజవాడ సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 15: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విజయవాడలోని కనకదుర్గ ఆలయం నుండి తెచ్చిన సారె, చీరను కనకదుర్గ ఆలయ డైరెక్టర్ పెద్దిరెడ్డి రాజా దంపతులు నేరేడుచర్లలోని విజయదుర్గ ఆలయంలోని అమ్మవారికి సమర్పించారు. మొదట విజయవాడ కనకదుర్గ ఆలయం నుండి తెచ్చిన సారెను స్థానిక గ్రంథాలయాభివృద్ధి కమిటీ చైర్మన్ కె.సూరిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా విజయదుర్గ ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సంప్రదాయసిద్ధంగా సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త తాటికొండ జానకిరాంరెడ్డి విరాళం అందచేశారు.

చిత్రం..విజయవాడ కనకదుర్గ ఆలయం నుండి వచ్చిన సారె, చీరకు నేరేడుచర్లలో పూజలు చేస్తున్న దృశ్యం