రాష్ట్రీయం

ఏక్ బార్ ఔర్ కేసిఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత ఎన్నికల కోసం తమ ప్రచార పంథాను గులాబి దండు మార్చినట్లు స్పష్టం అవుతున్నది. తెలంగాణ ప్రజల మనోభావాలకు దర్పణం పట్టిన సెంటిమెంట్‌ను గత సాధారణ ఎన్నికలలో ఉపయోగించుకుని, అధికార పగ్గాలు చేపట్టిన ఉద్యమ పార్టీ అధినాయకుడు, ప్రభుత్వాధినేతగా నాలుగున్నర ఏళ్ళ కాలంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను, అన్ని వనరులనూ వాడుకుని, ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేయించు కోవడంలో సఫలీకృతులైనారు. తమ నిత్య వినూత్న పథకాల వల్ల తెలంగాణ ప్రజలలో అధిక సంఖ్యాకులు ఎలా లబ్ది పొందుతున్నరో అన్న అంశాలు, ఎన్నికల నాటికి ప్రజలలోకి బలంగా చొప్పించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి, దాదాపు సఫలీకృతులైనారు. అయితే అనూహ్యంగా, హఠాత్తుగా జరిగిన పరిణామాలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ప్రారంభించి, కేటిఆర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ, చివరకు కొంగర కలాన్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతను తనయునికే అప్పగించడం, ప్రకటిత అభ్యర్థుల నియోజకవర్గాలలో చోటుచేసుకుంటున్న అసమ్మతి, అసంతృప్తుల బుజ్జగింపులు, సమయోచిత నిర్ణయాల సంపూర్ణ బాధ్యతలను కేటిఆర్‌కే అప్పగించడం, హరీష్‌రావు సైతం, కేటిఆర్ సీఎం అయి, ఆయన వద్ద మంత్రిగా పని చేయడానికి సిద్దమని, పని గట్టుకుని ప్రకటించడంతో తెరాస అధినేత, యువరాజు పట్ట్భాషేకానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ముందస్తుగా శాసనస
భను రద్దు పరిచి, ఎన్నికలను స్వయంగా ఆహ్వానించిన వేళ...అనూహ్య రీతిలో ఆజన్మ విరోధులైన జాతీయ కాంగ్రెస్, ప్రాంతీయ టీడీపీ, కొత్తగా మొగ్గ తొడగనున్న టీజీఎస్‌లు మహా కూటమిగా ఏర్పాటుకు, కలిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దమై, సీట్ల సర్దుబాట్ల కోసం చర్చలలో మునిగి తేలుతున్నాయి. వారి పొత్తులు, సర్దుబాట్లు, ఓట్ల మార్పిడీలు పక్కన పెడితే, ప్రస్తుతం తెరాస ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు పూర్తి విజయాన్ని సాధించి పెట్టలేవనే అభద్రతా భావానికి, తప్ఫలిత అసహనానికి లోనవుతున్నట్లు, అధినేత ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా శాసనసభ రద్దు పరచడానికి ముందున్న పరిస్థితులలో ఒకింత మార్పు రావడాన్ని పసిగట్టిన గులాబి దళనేత తమ ప్రచార వ్యూహాన్ని సైతం మార్చుకున్నట్లు తెలుస్తున్నది. ఉద్యమ పార్టీ అధినేతగా, మొండి పట్టుకు మారుపేరుగా, ప్రజలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కేసిఆర్, నాలుగేళ్ళ పాలనలో చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలలో ఆయన పరిపాలన పట్ల అధిక శాతం సానుకూల వైఖరి ఉన్నమాట రాజకీయ విశే్లషకులు అంగీకరిస్తున్న సత్యం. ప్రధానంగా లబ్దిదారుల ఓటు బ్యాంకే తమకు మరోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేయగలదనే ఆత్మవిశ్వాసం కేసిఆర్‌కు ఉందన్న

మాట యదార్థం. తెరాస అధికారాన్ని తిరిగి దక్కించు కోగలిగితే, కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే భావన, ఇటు తెరాస శ్రేణుల్లో, అటు సీనియర్లలో, ప్రజల నోళ్ళలో ప్రస్తుతం నానుతున్న అంశం. కాబోయే ప్రతిపాదిత ముఖ్యమంత్రిగా తారక రాముడి విషయం ప్రధానంగా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనుందో అన్న అనుమానాలతో, అసలుకే మోసం వస్తే ఎలా అన్న సందేహాలతో, తెరాస నాయకులు ప్రచార పంథా మార్చుకుంటున్నారన్నది సుస్పుష్టం. ఈ విషయంలో హరీష్‌రావుతో సహా నిన్నమొన్న ప్రచార కార్యక్రమాలలో చంద్రశేఖర్ రావే మరో 15ఏళ్ళు సిఎంగా ఉంటారని, ఉండాలని తమ, ప్రజల కోరిక అదేనని ప్రజలకు వివరిస్తున్న తీరు పంథా మార్చుకున్నారనే అంశానిక ఊతమిస్తున్నది. ప్రకటిత తెరాస అభ్యర్థులు కూడా హరీష్‌తో గొంతు కలుపుతూ, ‘‘ఔర్ ఏక్ బార్ కేసిఆర్’’ నినాదంతో ముందుకు సాగాలని, ఈ నినాదానే్న ప్రజలలోకి చొప్పించాలని నిర్ణయించుకుని, కార్యాచరణకు దిగినట్లు ద్యోతకమవుతున్నది.