రాష్ట్రీయం

అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 17: రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ సిఎల్పీ నేత, సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సాగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం జానారెడ్డి సమక్షంలో త్రిపురారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వాగ్ధానాలు నెరవేర్చని టిఆర్‌ఎస్ నాయకులకు ప్రజలు ఓట్లు వేయరని నమ్మటానికి వీలు లేకుండా టిఆర్‌ఎస్ నాయకులు తయారయ్యారని ఎద్దెవ చేశారు. టిఆర్‌ఎస్ మెనిఫేస్టో కాంగ్రెస్ మెనిఫెస్టోను కాపి చేసి ప్రకటిస్తున్నారని అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకుండా ఎన్నికలకు వచ్చినందుకు ప్రజలే గుణపాఠం చెపుతారన్నారు. కాంగ్రెస్ స్కీంలను వాగ్ధానాలను తప్పక అమలుచేస్తుందన్నారు. ఈనెల 30వరకు కూటమితోపూర్తీస్ధాయి నిర్ణయం తీసుకుంటామన్నారు. టిఆర్‌ఎస్ అధికారంతో సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలే కాంగ్రెస్‌ను గెలిపించకుంటారన్నారు. సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక అన్నారు. గురువారం నాడు సాగర్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన అనంతరం శంఖారావం పూరిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పి వైస్‌చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, శంకర్‌నాయక్, మోహన్‌నాయక్, ఉంగరాల శ్రీనులు ఉన్నారు.