ఆంధ్రప్రదేశ్‌

గ్రామ కంఠాలకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు 13,71,416 ఉన్నాయని, అందులో అంగీకరించిన విజ్ఞాపనలు 12,41,616 ఉండగా, తిరస్కరించిన విజ్ఞాపనలు 1,29,800 ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కె ఇ కృష్ణమూర్తి చెప్పారు. ప్రజలకు మరింత సహాయం అందించడానికి ప్రభుత్వం మీ భూమి, మీ పంట, రుణ మార్పిడి ఏర్పాటు, మీ సేవ ద్వారా రెవిన్యూ సర్వీసులు, ధ్రువపత్రాల భట్వాడా, ఇ పాస్ పుస్తకాలు వంటి సేవలను ప్రారంభించిందని అన్నారు. గ్రామకంఠాలను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ప్రైవేటు అతిథి గృహాలకు అనుమతి లేదు
ఇక మీదట తిరుమలలో ప్రైవేటు అతిథి గృహాల నిర్మాణానికి అనుమతివ్వరాదని నిర్ణయించినట్టు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
2005 నుండి ఎపిఎస్‌ఆర్‌టిసిలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమిస్తున్నామని, కనీసం మూడేళ్లు సర్వీసు నిండిన వారి సర్వీసులను క్రమబద్థీకరిస్తున్నట్టు రోడ్లు భవనాల శాఖా మంత్రి సిద్ధారాఘవరావు తెలిపారు.
గోదాముల నిర్మాణం
నెల్లూరు జిల్లా కోవూరు నార్త్ రాజుపాలెంలో మార్కెట్ యార్డు నిర్మాణంలో ఉందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ గోదాము నిర్మాణం 2016 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఎయు విసిపై విచారణ
ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చేపట్టిన నియమాకాలు, పిహెచ్‌డి అడ్మిషన్లపై విచారణ జరుగుతోందని కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
పూల మొక్కల పెంపకానికి ప్రోత్సాహం
2015-16 సంవత్సరంలో పాలీ హౌస్‌లలో అధిక మిలువ ఉన్న పువ్వుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రక్షిత సేద్యం కింద 17.42 కోట్ల మొత్తాన్ని కేటాయించామని, విడి పువ్వుల సాగును ప్రోత్సహించడానికి 2.51 కోట్లు కేటాయించామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.

మరో ఏడాది సస్పెన్షన్
రోజాపై హక్కుల కమిటీ సిఫార్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: వైకాపా ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని హక్కుల కమిటీ చేసిన సిఫార్సు నివేదికను సభా హక్కుల సంఘం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదికను సైతం సభ ముందుంచారు. బుద్ధప్రసాద్ తన నివేదికను ఈ నెల 19న స్పీకర్‌కు అందజేశారు. డిసెంబర్ 18న రోజా తనపై నిందాపూర్వకమైన ఆరోపణలు చేశారని పాయకరావుపేట ఎమ్మెల్యే వి అనిత డిసెంబర్ 22న జీరో అవర్‌లో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 18నాటి ఘటనలపై శాసనసభ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ రోజా, మరో నలుగురిపై చర్యలు తీసుకోవాలని తన సిఫార్సుల్లో పేర్కొంది. అయితే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన గల సభాహక్కుల కమిటీ మాత్రం రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె శ్రీ్ధర్‌రెడ్డి తాము చేసిన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేయడంతో వారిని క్షమించాలని కమిటీ అభిప్రాయపడింది. కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు, రోజాలపై మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రోజా తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం, అసెంబ్లీలో ధర్నాకు దిగడం తదితర పరిణామాల తరువాత ఆమెను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని హక్కుల కమిటీ సిఫార్సు చేయడం గమనార్హం.
పుస్తకాల బరువుపై
సలహా కమిటీ ఏర్పాటు
మంత్రి గంటా వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: విద్యార్థులకు పుస్తకాల బరువును తగ్గించేందుకు గాను సలహా కమిటీని నియమిస్తున్నట్లు ఎపి ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి.ఎస్.మూర్తి, రాము సూర్యారావుతో పాటు డాక్టర్ ఎస్‌ఆర్ పరిమి (వికాస విద్యావనం,విజయవాడ), శ్రీరామ పద్మనాభం (రిషి వ్యాలి, మదనపల్లె), డాక్టర్ ఎన్.మంగాదేవి (వేంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు), డాక్టర్ డి.సరస్వతి (లెబన్ స్కెల్ఫ్, విశాఖపట్నం), డాక్టర్ పి.డి.కామేశ్వరరావు (శోధన, చీపురుపల్లి), సి.వి.కృష్ణయ్య (జనవిజ్ఞానవేదిక), డాక్టర్ యూ.సుబ్బరాజు(తింబక్టు), టివిఎస్ రమేష్ (ఎస్‌ఈఆర్‌టి) తదితరులు సభ్యులుగా ఉంటారు. కాగా ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసే క్రమంలోనే మంగళవారం అన్ని యూనివర్శిటీలు వైస్ చాన్సలర్లు, రిజిష్ట్రార్లతో సమావేశం అవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పేపర్లు లీక్ అయినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మంత్రి ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు పరీక్షకు 6,53,549 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
ప్రభుత్వాలను పడగొట్టడం
మొదలుపెట్టింది కాంగ్రెస్సే
కేంద్ర మంత్రి వెంకయ్య విసుర్లు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 21: దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం మొదలు పెట్టింది కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. సోమవారం ఇక్కడ మాట్లాడుతూ కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వామపక్ష నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కాంగ్రెస్సేనని అన్నారు. 1984లో ఏపిలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ తమ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిందని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించిన కరుణానిధి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసిందన్నారు. 1997లో జమ్మూకాశ్మీర్‌లో, గోవాలో మనోహర్ పారికర్ ప్రభుత్వాన్ని, మేఘాలయలో ఎన్సీపి ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న సమయంలో 90సార్లు రాష్టప్రతి పాలన విధించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూల్చితే మంచిది, వేరేవాళ్లు కూల్చితే పార్టీ ఫిరాయింపు అవుతుందా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ట్‌ని వీడితే బిజెపిది బాధ్యతనా? అని ప్రశ్నించారు.