రాష్ట్రీయం

తేలని కూటమి చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: మహాకూటమి నేతల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఒక హోటల్‌లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ కే. దిలీప్ కుమార్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. తమకు 16 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబట్టిన ప్రొఫెసర్ కోదండరామ్ ఏ మాత్రం మెట్టు దిగలేదని తెలిసింది. అన్ని సీట్లు ఇవ్వలేమని కుంతియా, ఉత్తమ్ ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 7 నుంచి 9 సీట్లు ఇస్తామని వారు తెలిపారు. అందుకు సమ్మతించని ప్రొఫెసర్ కోదండరామ్, దిలీప్ కుమార్ చర్చల నుంచి బయటకు వెళ్ళేందుకు ఉద్యుక్తులు కావడంతో, చర్చలు జరిపేందుకు వచ్చిన వారు అలా అర్థాంతంగా వెళ్ళిపోరాదని కుంతియా, ఉత్తమ్, రమణ వారికి నచ్చజెప్పి కూర్చోబెట్టారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిథిలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అయినా ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరామ్ పునరుద్ఘాటించారు. టీడీపీ సీట్ల సర్దుబాటు విషయంలోనే స్పష్టత రాలేదు. టీడీపీ కోరుతున్న సీట్లలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉండడం వల్ల సర్దుబాటు జరగడం లేదు. గత ఎన్నికల్లో తాము 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందినందున ఆ స్థానాలను తిరిగి ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు రమణ కోరుతున్నారు. ఇలా ఇచ్చుకుంటే పోతే చివరకు తమకు 50 శాతం సీట్లే మిగులుతాయని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాఉండగా శనివారం (20న) ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నందున, చర్చలను మరోసారి జరుపుదామని నిర్ణయించారు. సమావేశానంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో సీట్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ రెండు రోజుల్లో చర్చలు ఫలప్రదం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.