రాష్ట్రీయం

ఎవరు లెక్కిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా గణన చేయాల్సిన బాధ్యత ఎవరిది? గణన చేసేందుకు అధికారం ఎవరికి ఉంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీ జనాభా లెక్కలు తేలితే తప్ప పంచాయతీ ఎన్నికలు నిర్వహంచేందుకు వీలుకావడం లేదు. బీసీల జనాభా గణన తమకు అప్పగిస్తే వారం లేదా రెండువారాల్లో పూర్తి చేస్తామని బీసీ కమిషన్ మూడు నెలల క్రితం చెప్పినప్పటికీ, ఇప్పుడు ఆ బాధ్యత తమది కాదని బీసీ కమిషన్ అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 లోనే ‘సమగ్ర కుటుంబ సర్వే’ చేసింది. ఈ సర్వే వల్ల గ్రామాలవారీగా, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల వారీగా ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారు అన్న విషయం తేలింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 186 లక్షల మంది (51 శాతం) ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 363 లక్షలుగా ఉన్నట్టు అప్పట్లో తేల్చారు. ఈ లెక్కలను ప్రభుత్వం హైకోర్టుకు 2018 మే, జూన్‌నెలల్లో సమర్పించి ఉంటే సరిపోయేదన్న వాదన వినిపిస్తోంది. బీసీల జనాభా శాస్ర్తియంగా జరపాలంటూ హైకోర్టు నాలుగునెలల క్రితమే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రభుత్వం వైపు నుండి ఉలుకూ-పలుకూ లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన 2011 జనాభా గణన ప్రకారం ఎస్‌సీలు, ఎస్‌టీలకు పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించారు. పంచాయతీల్లో ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్ల అంశాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. కేవలం బీసీల జనాభాను మాత్రమే ప్రశ్నిస్తున్నారు. 2014 లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగాబీసీల జనాభా గణన గణాంక శాఖ ద్వారా చేయించింది. వాస్తవంగా ఇవి శాస్ర్తియంగా జరిగిన లెక్కలే. ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకునేందుకు వీలుంది. హైకోర్టుకు బీసీల జనాభా లెక్కలు అందించేందుకు ఈ రెండు తరహా లెక్కలను అందించి ఉంటే సరిపోయేది. ఇంతటి మహత్తర అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. బీసీల జనాభా గణన విషయంలో హైకోర్టుకు స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. బీసీల జనాభా వివరాలు లేవన్న కారణంతో తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసిన నాలుగు నెలల కాలం గడచిన తర్వాత కూడా బీసీల గణన అంశంపై స్పష్టత రాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు బీసీల జనాభాను గణించేందుకు ప్రభుత్వం చర్యలేమీ ప్రత్యేకంగా తీసుకున్న దాఖలాలు లేవు.
హైకోర్టుకు బీసీల జనాభాకు సంబంధించి ఏ లెక్కలు సమర్పించాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉన్నతస్థాయి యంత్రాంగం సమాలోచన చేస్తోంది. గతంలో ముస్లింలను బీసీల్లో చేర్చి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిన సమయంలో బీసీ కమిషన్ సర్వే చేసింది. శాంపిల్ సర్వే అంటూ దానికి పేరుపెట్టారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ఉన్నదని బీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. సమగ్ర కుటుంబసర్వేను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.