రాష్ట్రీయం

రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశాన్ని ఐదు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు వచ్చాయని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నాయని కేంద్రమే చెప్పిందని తెలిపారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చనిపోయినవారి పేరుతో కేసులు వేశారని మండిపడ్డారు. నాలుగేళ్లలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, టీఆర్‌ఎస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతోందని అన్నారు. విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందజేస్తున్నామని అన్నారు. కర్నాటకలో రుణమాఫీపై రాహుల్ అవాస్తవాలు చెప్పారని, రుణమాఫీపై తెలంగాణ విధానానే్న కర్నాటకలో అమలుచేస్తున్నారని అన్నారు. లక్షా 9వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని అన్నారు. ఇప్పటికే 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 27వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మిగతా ఉద్యోగాల భర్తీపై కోర్టుల్లో కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ముల్కీ రూల్స్‌ను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని, పీవీ అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేదని దుయ్యబట్టారు. ఘాట్ విషయంలోనూ కాంగ్రెస్ వివక్ష చూపిందని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో రాహుల్ పచ్చి అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ముత్తాత ప్రారంభించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు 2014లో పూర్తయిందని అన్నారు. ప్రాజెక్టులపై కేసులు వేసి రైతుల నోట్లో మట్టికొట్టింది కాంగ్రెస్ నేతలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు కనీసం ఆరు గంటల పాటు విద్యుత్ ఇవ్వలేదని అన్నారు.