రాష్ట్రీయం

రక్తం చిందింది... సంప్రదాయమే గెలిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కర్రల యుద్ధంలో 52 మందికి గాయాలు *ఇద్దరి పరిస్థితి విషమం వేలాదిగా తరలివచ్చిన జనం
ఆదోని, అక్టోబర్ 20: కర్రల యుద్ధంలో సంప్రదాయమే గెలిచింది. పోలీసులు, అధికారులు తీసుకున్న చర్యలు నిష్పలమయ్యాయి. తలలు పగిలి రక్తం చిందింది. కాగడాల మంటలు అంటుకుని పలువురికి గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి సన్నిధిలో శనివారం తెల్లవారుజాము వరకూ జరిగిన బన్ని కార్యక్రమంలో సంప్రదాయమే గెలిచింది. స్వయంగా డీఐజీ శ్రీనివాస్, ఎస్పీ గోపీనాథ్ జెట్టీ, కలెక్టర్ సత్యనారాయణ, వందలాది మంది పోలీసులు, నిఘా కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా కర్రల సమరాన్ని నివారించలేకపోయాయి. బన్ని కార్యక్రమంలో 52 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదోనిలోప్రాథమిక చికిత్స అనంతరం ఉలిగప్ప, మల్లప్పను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఉలిగప్ప పరిస్థితి విషమంగా ఉంది. బన్ని కార్యక్రమం ప్రారంభం కాగానే ఒక్కసారిగా వేలాదిమంది చేతుల్లో కర్రలు కనిపించాయి. ‘డూర్ బహుపరాక్’ అంటూ డోలుబండ నుంచి 600 అడుగుల ఎత్తులో ఉన్న కొండపైకి వెళ్లి మాళమల్లేశ్వర స్వాములకు కల్యాణోత్సవం జరిపించారు. ఉత్సవమూర్తులను తీసుకుని కేకలు, ఈలలు వేస్తూ కాగడాలు విసురుకుంటూ భక్తులు పరుగులు తీశారు. మూడు ఉత్సవ విగ్రహాల చుట్టూ నెరణికి, నెరణికితండా, కొత్తపేట భక్తులు రక్షణ వలయంగా కర్రలతో బన్ని ఉత్సవాన్ని కొనసాగించారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత అడవిలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్షసపడ వద్దకు చేరుకుని రెండు చుక్కల రక్తం తీసి అక్కడ చల్లారు. అక్కడినుంచి శమీవృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి మళ్లీ దేవాలయం ప్రాంతానికి తిరిగి వస్తుండడంతో శివసానకట్ట, రథం పక్కనే ఉన్న సందులో నుంచి ఇతర గ్రామాలవారు ఎదురుగా కర్రలతో రావడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారి రణరంగంగా మారింది. ఓ పక్క తలలు పగిలి రక్తం కారుతున్నా పసుపు బండారం పూసుకుంటూ భక్తులు ముందుకు వెళ్లారు. కాగడాలు విసురుతున్న సమయంలో 10 మందికి గాయాలయ్యాయి. కర్రల యుద్ధంలో 52 మందికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ఉత్సవ మూర్తులను శివసాన కట్ట వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పింజరల్లో కట్ట వద్ద ఆ కులానికి చెందిన వ్యక్తి టెంకాయ కొట్టి ఉత్సవమూర్తులను శివసాన కట్ట వద్ద కూర్చోబెట్టడంతో బన్ని ఉత్సవం ముగిసింది.