రాష్ట్రీయం

హామీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 20: కాంగ్రెస్ పాలనలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అధికారం దక్కించుకున్న కేసీఆర్ ఇట్టి ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ‘ప్రజాగర్జన’ సభకు హాజరైన రాహుల్ గాంధీ సుదీర్ఘంగా 43నిముషాల పాటు హిందిలో ప్రసంగించారు. రాహుల్‌గాంధీ హిందిలో మాట్లాడుతుంటే, కాంగ్రెస్ నాయకుడు శ్రవణ్‌కుమార్ దాన్ని తెలుగులో అనువాదం చేస్తూ ప్రజలకు వినిపించారు. సభలో రాహుల్ మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ ప్రాజెక్ట్‌లకు రీడిజైన్ చేసి ఏలా అవినీతికి పాల్పడ్డరో, అదే విధంగా దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మోడి, కేసీఆర్ ఇద్దరు కూడా దొందుదొందేనని, తెలంగాణలో ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్ట్‌లను చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలోని అంబేద్కర్ పేరును కూడా తొలగించి, 35వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్‌ను 1లక్ష కోట్లకు పెంచి అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన రైతులకు చేకూరిన ప్రయోజనం కూడా ఏమి లేదని అన్నారు. రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలు కోసం కాంగ్రెస్ హాయంలో భారత ఎరోనాటిక్ సంస్థకు తాము అప్పగిస్తే, నరేంద్ర మోడి అధికారంలో వచ్చాక రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోళ్లను ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత ఏరోనాటిక్స్‌ను కాదని, 35వేల కోట్ల అదనపు భారంపెంచి దీన్ని అనిల్‌అంబానికి కట్టబెట్టారని ఆరోపించారు. ఇది పెద్ద కుంభాకోణం అని అన్నారు. నల్లదనం వెలికి తీసి, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తానని చెప్పిన మోడి నల్లధనానికే కాపాలగా మారారని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వలేక పోయారని అన్నారు. అబద్ధపు మాటలతో మోడి సైతం కాలం వెల్లిబుచ్చుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలకు చౌకిదార్‌గా ఉంటానని చెప్పిన దేశ ప్రధాని నరేంద్ర మోడి రైతులకు, దేశ ప్రజలకు అన్యాయం చేస్తూ, పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దేశంలో నోట్ల రద్దును సైతం ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని ప్రజలందరు కూడా వ్యితరేకించి, ఇది సరైన పద్దతి కాదన్నప్పటికీ, దీనికి కేసీఆర్ మాత్రం తన సంపూర్ణ మద్దతు పలికారని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎమ్‌లు ముగ్గురు ఒక్కటేనని అన్నారు. ఈ ముగ్గురు కలిసి దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం తెలంగాణ ప్రజలందరు కలిసి కట్టుగా ఉద్యమించారని, ఇంతే కాకుండా గల్ఫ్‌కు వెళ్లిన వారు సైతం ఉద్యమించారని, ముఖ్యంగా యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వీటిన్నింటిని చూసి చలించిన పోయిన కాంగ్రెస్, తమకు ఏలాంటి నష్టం జరిగిన సరే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలన్న దృఢసంకల్పనికి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత అధికారంలో వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను సకారం చేస్తారని అందరు ఊహించారని, అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా భావించారని, కాని అందరి ఊహలు తారు మారు చేసిన ఆయర నాల్గున్నర ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిని విస్మరించి కేవలం తన కుటుంభాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలో రాగానే నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాలు భూమి, కేజీటుపీజీ విద్య, ఇంటింటికి తాగునీరు, డబుల్‌బెడ్‌రూంలు ఇస్తానని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నుండి తీర్చలేకపోయారని అన్నారు. కేసీఆర్ అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రంలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. వరంగల్, ఖమ్మంలోని మిర్చిరైతులకు సంకేళ్లు వేయించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. నాల్గున్నర ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని 2లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని, ఇది ఒక్కొకుటుంభంపై 60వేల అప్పు ఉంటుందని, అలాగే ప్రతి వ్యక్తిపై 60వేల రూపాయల అప్పును జమ చేసి పెట్టిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. 300రూపాయల కోట్లతో ఇంటిని నిర్మించుకున్న కేసీఆర్, కనీసం బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేక పోయారని అన్నారు. ఎన్నికల్లో మాత్రం అధికారంలో వచ్చిన వెంటనే వందరోజుల్లో నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. కేంద్రంతో పాటు టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి, పసుపురైతులను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రైతులకు 2లక్షల రుణాలను ఒకేసారి మాఫి చేస్తామని అన్నారు. ఇంతే కాకుండా అధికారంలో వచ్చిన ఏడాదిలోపే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వికలాంగులకు మూడు వేల వృద్దాప్య పించన్‌లు, అసరా పించన్‌లు రెండు వేలు అందిస్తామని అన్నారు. పత్తిరైతులకు క్వింటాల్‌కు 7వేల రూపాయల మద్దతు ధర చెల్లిస్తామని, నిరుద్యోగ భృతి కింద 3వేలు అందిస్తామని అన్నారు. కేసీఆర్ లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కనీసం10వేల ఉద్యోగాలు ఇవ్వలేక పోయారని అన్నారు. తాను చెప్పింది చేస్తానని, అబద్దాలు తనకు నచ్చవని అన్నారు. తాను కర్నాటక ఎన్నికల్లో రైతులకు ఒకేసారి రుణమాఫి చేస్తానని చెప్పి, అధికారంలో వచ్చిన వెంటనే అక్కడి రైతులకు ఒకేధపాలో రైతు రుణాలు మాఫి చేశానని అన్నారు. ఈ విషయాన్ని సభకు వచ్చిన ప్రతి ఒక్కరు తెల్సుకోవచ్చని అన్నారు. అబద్దాలు, మోసాలు, అవినీతి పరులకు ఓటు వేయాలనుకుంటే, బీజేపీ,టీఆర్‌ఎస్ వైపు వెళ్లాలని, నీతినిజాయితీకి ఓటు వేయాలంటే, కాంగ్రెస్ వైపు రావాలని అన్నారు. బీడికార్మికులను ఆదుకుంటామని అన్నారు. అందరి భాగస్వామ్యంతోనే సుపరిపాలన అందిస్తామని అన్నారు. నీరు, నిధులు, నియమాకాలు కాంగ్రెస్ పాలనలో పుష్కలంగా ఉంటాయని అన్నారు. చెప్పింది చేసే సత్తా కాంగ్రెస్‌తోనే సాధ్యం అని అన్నారు. ఈ సభలో కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్‌అలీ ఎఐసీసీ ప్రధానకార్యదర్శి రాంచంద్ర కుంతియ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, ఎఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, రేణుకచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు పొన్నలలక్ష్మయ్య, జానారెడ్డి, సునీతలక్ష్మారెడ్డి, గీతారెడ్డి, కొమట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్, సురేష్‌కుమార్‌షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి, ఎంపి మధుయాష్కి, నందిఎల్లయ్య, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహేర్‌బీన్ హుందాన్‌లు పాల్గొన్నారు.