రాష్ట్రీయం

పగబట్టిన ప్రకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/నెల్లూరు, డిసెంబర్ 1: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపధ్యంలో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో మంగళవారం కూడా కుంభవృష్టిగా వర్షం కురిసింది. చిత్తూరు తూర్పు మండలాల్లో కురిసిన వర్షాలతో పలు గ్రామాలు జల దిగ్భంధనంలోచిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సరాసరిన 10 సెం.మీ.వర్షపాతం నమోదవగా, కె వి బి పురంలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉబ్బలమడుగు, కాళంగి రిజర్వాయర్, స్వర్ణముఖి నది పొంగిపొర్లుతున్నాయి. వాగులు వంకల్లో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వెదురుకుప్పం మండలంలో మంగళవారం తిరుపతి - చిత్తూరుకు దేవలపాల్యెం మీదుగా వెళ్ళే ఆర్టీసి బస్సు పెరుమాళ్ళ పల్లె వద్ద ప్రవహిస్తున్న వాగు మీదగా వెళ్ళింది. ఈక్రమంలో వరదనీరు బస్సు ఇంజిన్‌లోకి వెళ్ళడంతో వాగు మధ్యలో ఆగిపోయింది. తక్షణం అప్రమత్తమైన డ్రైవర్ అందులోని 40 మంది ప్రయాణికులను స్థానికుల సహాయంతో ఒడ్డుకు తీసుకువచ్చి మరో బస్సులో వారి స్వగ్రామాలకు చేర్చారు. తిరుమల్లో కూడా భారీ వర్షం కురుస్తుండటంతో చలి విపరీతంగా పెరిగింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తాము బసచేసే గదులకు వర్షంలో తడుస్తూనే చేరుకుంటన్నారు. వరదయ్యపాల్యెం మండలంలో జనజీవనంతోపాటు, పలు గ్రామాలకు రాకపోకలు స్థంబించాయి. వరదయ్యపాల్యెం నుంచి సి ఎల్ ఎన్ పల్లి, సంతవేలూరు, మావిళ్లపాడు, అంభికాపురం, వెంకటాపురం తదితర గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. మావిళ్ళపాడు గ్రామంలోని హరిజనవాడకు వరదనీరు చుట్టుముట్టింది. ఇక్కడ బాధితులకు అమ్మభగవాన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు సరఫరా చేశారు. ఇసుక తాగేలి, గూడలవారిపాల్యెం గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఉబ్బలమడుగు డ్యాం నీండిపోయి కలుజులోకి వచ్చిన నీటి ప్రవాహానికి రోడ్డు కోసుకుపోయి ఉబ్బలమడుగు వెళ్ళేందుకు వీలులేకుండా పోయింది. నెల్లూరుజిల్లాలో మంగళవారం జిల్లా అంతటా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. నెల్లూరు నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లో నాలుగు దఫాలుగా భారీగానే జల్లులు పడ్డాయి. గూడూరు డివిజన్‌లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల ప్రజల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. బాలాయపల్లి మండలం నిండలి వద్ద కైవల్యా ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా దాదాపు 15 గ్రామాల ప్రజలకు గూడూరుతో సంబంధాలు తెగి పోయాయి. చిత్తూరు జిల్లాలో కాళంగి రిజర్వాయరు గేట్లు ఎత్తి వేయడంతోవరద నీరు సూళ్లూరుపేటను ముంచెత్తింది. దీంతో పట్టణానికి ఆనుకొని ఉన్న మన్నారు పోలూరుకు అధికారులు ఉదయం నుండి రాక పోకలునిలిపి వేశారు.