రాష్ట్రీయం

ఆర్యవైశ్య మహాసభకు రాజకీయ రంగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: సేవా దృక్పథంతో పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహకారం అందించటంతో పాటు ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఏర్పడిన ఆర్యవైశ్య మహాసభకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజకీయ రంగు పులిమి భ్రష్టు పట్టిస్తున్నారని పలువురు ఆర్యవైశ్య పెద్దలు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో రాష్టస్థ్రాయి ఆర్యవైశ్యుల మహాసభ మేధోమథన సమావేశం ఆదివారం జరిగింది. 13 జిల్లా ల నుండి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడు తూ రాష్ట్రంలో నూతనంగా ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తు న్నా నేటికీ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించ లేదన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి, నూతన భవన నిర్మాణానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించినదీ చెప్పలేదని, ఇప్పటివరకు కనీసం జనరల్ బాడీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. శాసనమండలి సభ్యుడు కొల్లగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు అన్యాయంగా, అక్రమంగా జరిగాయన్నారు. ఎలా జరిగినా గెలిచిన వ్యక్తులు ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయాలని, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆర్యవైశ్య మహాసభను టీడీపీకి తాకట్టు పెట్టేలా ప్రస్తుత కార్యవర్గం కృషి చేస్తోందన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను మహాసభ పట్టించుకోకపోతే మరో మహాసభ ఏర్పాటుకు పలువురు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

చిత్రం..మేధోమథన సమావేశంలో పాల్గొన్న ఆర్యవైశ్య నాయకులు