రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తులపై అమిత్ షా కన్ను: కేశినేని నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులపై నాలుగేళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు జగన్నాటకం ఆడుతున్నదని, వాస్తవానికి ఆ సంస్థ ఆస్తులపై అమిత్‌షా కన్ను పడిందంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ మండిపడ్డారు. కేశినేని భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీల్లో నేటికీ దాదాపు 18 పెండింగ్‌లో ఉంటే ఇంతకాలం వాటిని అమలు చేయలేని బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ నేడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆ కంపెనీ రూ. 6500 కోట్లు డిపాజిట్ రూపంలో వసూలు చేయగా ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నదని, అయినా బాధితులను ఆదుకోటానికి రాష్ట్ర ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ఆస్తులపై కనె్నయ్యటం వల్లనే కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎస్సెల్ గ్రూప్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బెదిరించారని అన్నారు. బీజేపీ నేతలు పవన్, జగన్, కేసీఆర్‌లతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంటే అవినీతిలో గుజరాత్ అగ్రస్థానంలో ఉందన్నారు. తుపాన్ కష్టంలో ఆదుకోమంటే కేంద్రం కనీసం ఓ బృందాన్ని కూడా పంపించలేదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ పొత్తు వల్ల అనేక సీట్లు కోల్పోవాల్సి వచ్చిందంటూ ఏదిఏమైనా ఆ పార్టీ శని వదిలిందన్నారు. జాతీయ బ్యాంక్‌లను ముంచిన దొంగలను దేశ సరిహద్దులను దాటించిన పెద్దలు నేడు ఏదో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్‌తో కల్సి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ఉబలాటపడుతున్నారని అన్నారు.