ఆంధ్రప్రదేశ్‌

అడిగినవి ఇస్తేనే అమరావతికి వస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 3అమరావతి2కి శంకుస్థాపన జరిగే వరకూ రాజధాని నిర్మాణాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్న విదేశీ కంపెనీలు ఇప్పడిప్పుడే తమ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అమరావతి నిర్మాణంలో కీలక భాగస్వాములమవుతామన్న సింగపూర్ ప్రతినిధులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. శంకుస్థాపనకు ముందే జపాన్ అమరావతి గురించి భారత విదేశీ వ్యవహారాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. తాజాగా లండన్ కూడా అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరిస్తామని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి నిర్మాణానికి కావల్సిన మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌ను కూడా సింగపూర్ ఉచితంగా తయారు చేయడానికి ముందుకు వచ్చింది. లోపాయికారీ విషయం ఏంటంటే, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. సీడ్ క్యాపిటల్ ప్లాన్‌ను గత ఏడాది జూలైలో సింగపూర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందచేశారు. ఆ సందర్భంలోనే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సింగపూర్ మంత్రిని చంద్రబాబు కోరారు. సీడ్ క్యాపిటల్ ప్లాన్‌లో కొన్ని సవరణలు చేయాలని సింగపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సింగపూర్ ప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. ఆ తరువాత సింగపూర్ ప్రతినిధులు కొన్ని షరతులు విధిస్తూ వస్తున్నారు. కోర్ క్యాపిటల్‌లో 30 కిలో మీటర్ల పరిధి అంతా తమ అధీనంలోనే ఉండాలని, అక్కడ పనులన్నీ తామే చేయాలని సింగపూర్ ప్రతినిధులు మొదటి షరతు విధించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, ఈ షరతు 25 సంవత్సరాల వరకూ అమల్లో ఉండే విధంగా ఖచ్చితమైన ఒప్పందం చేసుకోవాలని కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. గ్లోబల్ టెండర్లలను పిలిచి, ఎవరు తక్కువ కోట్ చేస్తే, వారికే ఆయా పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోలేదు. సింగపూర్ అనుబంధ సంస్థ మాత్రమే రాజధాని నిర్మాణానికి ఉత్సాహాన్ని కనబరుస్తోంది. మాస్టర్ ప్లాన్ ఇచ్చింది కూడా ఈ సంస్థే. ఇదిలా ఉండగా సింగపూర్ నుంచి పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందలేదు. తాత్కాలిక సెక్రటేరియట్ కడుతున్న ప్రభుత్వం, శాశ్వత సెక్రటేరియట్ ఎక్కడ కడుతుందో చెప్పలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇక జపాన్ ప్రభుత్వం అమరావతి గురించి మన దేశ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వివరాలు సేకరించింది. అమరావతి గురించి పూర్తి స్థాయిలో విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక ఇవ్వకపోవడం వలనే ఆదేశ ప్రధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల లండన్‌లో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి లండన్ సహకారాన్ని ఆయన అర్థించిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరిస్తామని లండన్ చెప్పడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదియేమైనా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్, జపాన్, చైనా దేశాలను రాజధాని నిర్మాణంలో భాగస్వాములను చేసేకన్నా, ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న యుఎస్, లండన్‌లను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
మరోపక్క రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులను రాబట్టడానికి ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం కన్నా, నిర్మాణంలో విదేశీ సంస్థలను ఏవిధంగా భాగస్వాములను చేయాలన్నదానిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ వ్యవహారం కూడా కేంద్రంలో చర్చనీయాంశమైందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి నిర్థిష్ఠమైన హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు ముచ్చటపడి తీసుకువచ్చిన కంపెనీలన్నీ తమ అంతర్గత అజెండాను బయటపెట్టడంతో అమరావతి నిర్మాణంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి.

చిత్రం.. రాజధాని ముఖ చిత్రం