ఆంధ్రప్రదేశ్‌

హక్కుల కమిటీ ముందుకు రోజా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రివిల్లేజస్ కమిటీ ముందుకు హాజరవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో మంగళవారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. ప్రివిల్లేజస్ కమిటీ ముందు రోజా హాజరు కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే తనను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్భాషలాడిన టేపులను కూడా బయటపెట్టాలని రోజా స్పీకర్ కోడెల శివప్రసాద రావును కోరుతూ లేఖ రాయనున్నారు. ఇలాఉండగా అసెంబ్లీ నిర్ణయం సరైందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోనున్నందున, ఈ నెల 29, 30వ తేదీల్లో పార్టీ ఎమ్మెల్యేలు తప్పని సరిగా సభకు హాజరుకావాలని ‘విప్’ జారీ చేసినట్లు సమాచారం. ఇలాఉండగా రోజా కేసులో కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించేందుకు ఎపి అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ నిరాకరించినట్లు రోజా తరపు న్యాయవాది చెప్పారు.
ఎపి అసెంబ్లీ, శాసనమండలి వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారానికి వాయిదా పడగా, శాసనమండలి సోమవారం నాటికి వాయిదా పడింది. మరో పక్క వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నెల 29,30 తేదీల్లో సభకు తప్పనిసరి హాజరుకావాలని సూచించింది. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పేర్కొంటూ విప్ జారీ చేశారు. కాగా శాసనమండలిలో మంగళవారం ఇసుక మాఫియాపై వాడీ వేడి చర్చ జరిగింది. టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది.
సభలో సుహృద్భావం
వెల్లివిరియాలి
హైకోర్టు తీర్పు అనంతరం
సభలో స్పీకర్ కోడెల వ్యాఖ్య
నల్లబ్యాడ్జీలు ధరించి వచ్చిన వైకాపా సభ్యులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 22: శాసనసభ్యురాలు రోజా కేసులో సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు కొట్టివేసినట్లు సమాచారం అందిందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో చెప్పారు. మంగళవారం సభ జరుగుతున్న సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కోర్టులో తీర్పు ఎలా వెలువడిందనే అంశంపై ఇరుపక్షాల్లో ఉత్కంఠ ఉన్నందున, ఆ మేరకు తీర్పు గురించి సభకు వివరిస్తే బాగుంటుందని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ వెంటనే స్పందిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టిందని, ప్రస్తుతానికి ఈ మేరకు మాత్రమే సమాచారం ఉందని చెప్పారు. పూర్తి సమాచారం అందాల్సి ఉందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ సభ్యులు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలని, గౌరవించుకోవాలని అన్నారు. అనంతరం సభ ఇతర అంశాలపై కొనసాగింది. ఇదిలావుంటే సభలో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు, ప్రతిపక్ష నేత జగన్ సహా అంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష సభ్యులను వేధిస్తున్నందుకు నిరసన తెలిపేందుకు గాను నల్లబ్యాడ్జిలతో విచ్చేశారు.

అమరావతిలోనే
ఉగాది వేడుకలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 22 : దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను కొత్త రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది వేడుకలకోసం ప్రణాళిక సిద్ధం చేసేందుకు సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తెలుగు సంస్కృతి, వైభవం, ఉట్టిపడేలా వేడులకు నిర్వహించాని నిర్ణయించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఉగాది వేడుకల సందర్భంగా దుర్ముఖినామ సంవత్సర పంచాంగాన్ని, వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉత్తమ రైతులు, ఉత్తమ శాస్తవ్రేత్తలను ఈ సందర్భంగా సన్మానిస్తామన్నారు. వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి సన్మానాలు ఉంటాయని వివరించారు. అవార్డుల ఎంపిక కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో కవి సమ్మేళనం జరుగుతుందని, భువన విజయం ఉంటుందని మంత్రి పల్లె తెలిపారు. దేవాదాయ ఆధ్వర్యంలో పంచాంగపఠనం ఉంటుందని, తితిదే పండితుల ఆశీస్సులు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.