ఆంధ్రప్రదేశ్‌

ఐదుగురు విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం /తాడేపల్లి: హోలీ పండుగలో విషాదం నెలకొంది. ఐదుగురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు. విశాఖ బీచ్‌లో ఇద్దరు. కృష్ణా నదిలో ఇద్దరు మునిగి మృతి చెందారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయ. కృష్ణానదిలో స్నానానికి వచ్చి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందారు. సదరు ఘటనపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని కానూరులోగల సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటి ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకున్నారు. ఈక్రమంలో సీతానగరంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో కృష్ణానది ఒడ్డున రంగులు చల్లుకుంటూ, ఆడుతూ, పాడుతూ గడిపారు. అనంతరం స్నానం చేయటానికి నదిలోకి దిగారు. ఈక్రమంలో వారి వద్ద ఉన్న వాటర్ బాటిల్‌తో నదిలో సరదాగా ఆడుతుండగా బాటిల్ నదిలోపలికి వెళ్లింది. ఆరుగురిలో ఒక్కరికి కూడా ఈత రాకపోవటంతో ఆరుగురు విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నది లోపల ఉన్న వాటర్ బాటిల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో నదిలో ముందర ఉన్న నలుగురు విద్యార్థులు ఊబిలో చిక్కుకున్నారు. ఒడ్డువైపు ఉన్న ఇద్దరు విద్యార్థులు నలుగురిలో ఒకరిని కాపాడగా ముగ్గురు విద్యార్థులు నదిలోని ఊబిలో చిక్కుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నదిలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థులను బయటకి తీయించి స్థానిక మణిపాల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించటంతో వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాలను పోస్ట్‌మార్డం నిమిత్తం మంగళగిరి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు విజయవాలోని కొత్తపేట, వన్‌టౌన్, బెంజ్‌సర్కిల్ ఏరియాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని గుంటూరు అదనపు ఎస్‌పి భాస్కరరావు, నార్త్‌జోన్ డిఎస్‌పి రామాంజనేయులు, సిఐ హరికృష్ణ, ఎస్‌ఐలు వీరేంద్రబాబు, వినోద్‌కుమార్ సందర్శించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కాగ విశాఖలో హోలీ సంబారాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు మత్స్యకార యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. విశాఖలోని జాలరిపేటకు చెందిన 20 మంది మత్స్యకార యువకులు వుడా పార్క్ వద్ద హోలీ పండుగను బుధవారం జరుపుకున్నారు. అనంతరం అక్కడి బీచ్‌లో కబడ్డీ ఆడారు. తరువాత సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అలల తాకిడి తీవ్రంగా ఉండటంతో ఆరు మంది యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు, మిగిలిన యువకులు కలిసి నలుగురిని రక్షించారు. మిగిలిన తెడ్డు రాము (22), వి.కార్తీక్ (17) ఆచూకీ లభించలేదు. గల్లంతైన వీరి కోసం మైరైన్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు.

కృష్ణానదిలో మృతి చెందిన విద్యార్థులు