రాష్ట్రీయం

ఎమ్సెట్ యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి 2018-19 విద్యా సంవత్సరం నుండి జాతీయ ప్రవేశపరీక్ష - జేఈఈనే ప్రామాణికంగా తీసుకోవాలని భావించినా దానిపై ఇంత వరకూ స్పష్టత రాకపోవడంతో 2019లో జరిగే అడ్మిషన్లకు ఎమ్సెట్ ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అదే విధంగా వెటర్నరీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ వంటి ఇతర కోర్సులకు ఎమ్సెట్ - అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షను కూడా యథాతధంగా నిర్వహిస్తారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్టు తెలిసింది. ప్రభుత్వం నుండి ఆమోదం లభించగానే వచ్చే విద్యాసంవత్సరానికి నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూలను ప్రకటించనున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న డీసెట్ అడ్మిషన్లు ఇటీవల పూర్తికాగా, లాసెట్ అడ్మిషన్లు నవంబర్ మొదటి వారంలో పూర్తి చేశారు. రెండో దశ లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. దాంతో ఈ ఏడాది అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేసినట్టవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్, డెంటల్ కాలేజీల్లో యుజీ కోర్సులకు నీట్ - యూజీ, పీజీ కోర్సులకు నీట్ పీజీ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు సైతం జాతీయ పరీక్ష ర్యాంకుల ఆధారంగానే చేపట్టాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉన్నా, రాష్ట్రాలు మాత్రం వెనుకంజ వేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు
పోటీ పరీక్షలు నిర్వహించలేక , ఆర్ధిక భారాన్ని తట్టుకోలేక జాతీయ ప్రవేశపరీక్షలో చేరాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం జాతీయ ప్రవేశపరీక్షలో చేరేందుకు వెనుకంజ వేస్తున్నాయి. దీనికి కారణం అడ్మిషన్లపై రాష్ట్రం పెత్తనం పోయి, కేంద్రం పెత్తనం పెరుగుతుందనే ఆందోళనేననేది సుస్పష్టం. ఇప్పటికే విద్యాసంస్థల తనిఖీలు, అనుమతులు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. కేవలం అనుబంధ గుర్తింపు మాత్రమే సంబంధిత వర్శిటీలు చేపడుతున్నాయి. ఇపుడు అడ్మిషన్ల అధికారం కూడా కోల్పోతే రాష్ట్రానికి ఏం ఉండదనే భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్లను ఈ ఏడాదికి రాష్ట్రం నిర్వహించాలని యోచిస్తోంది. 2019-20లో జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించి, ఏకరూప ఉమ్మడి ప్రవేశపరీక్షలు నిర్వహిస్తే అపుడు జాతీయ పూల్‌లోకి వెళ్లడం లేదా కేవలం జాతీయ ప్రవేశపరీక్ష ఆధారితంగా అడ్మిషన్లు చేపట్టాలని ఉన్నత విద్యామండలి అధికారులు యోచిసున్నారు. దేశవ్యాప్తంగా 19 లా విశ్వవిద్యాలయాలకు క్లాట్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆ పరీక్ష నిర్వహణ కమిటీకి హైదరాబాద్ నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్త్ఫా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్లు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు సొంత ప్రవేశపరీక్షనే నిర్వహిస్తోంది. కొన్ని ప్రవేశపరీక్షల నిర్వహణ వదిలించుకుని జాతీయ ప్రవేశపరీక్షల్లో చేరడమే ఉత్తమమనే భావన కూడా వ్యక్తమవుతోంది.