రాష్ట్రీయం

ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 5: పేదలకు వైద్య సదుపాయాలు అందించడానికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రిని, మండలానికి 30 పడకల ఆసుపత్రులను మంజూరు చేస్తున్నామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు తమ సమస్యలపై మంత్రి కె.తారకరామారావుకు వినతి పత్రం అందించారు. అనంతరం మహసభలో మంత్రి కేటీ.రామారావు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కోసం కేసీఆర్ స్ఫూర్తిదాయక ఆలోచన చేస్తున్నారని, ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో ఆర్‌ఎంపీ, పీఎంపీలను సైనికులుగా తీసుకరావాలని భావించి తెలంగాణ ప్రభుత్వం జీవో 428ను తెచ్చారన్నారు. దీని అమలులో భాగంగా ‘కమ్యూనిటీ పారా మెడికల్’ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ విధానం ప్రకారం సర్ట్ఫికెట్లు ఇచ్చి వారి వృత్తికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది జిల్లాకే పరిమితం
చేయకుండా రాష్ట్రంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులందరికీ తగిన పట్టా ఇచ్చి తగిన వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో 45 వేల మంది వైద్యులు దరఖాస్తు చేసుకుటే 20 వేల మందికి శిక్షణ ఇచ్చినప్పటికీ వారికి ప్రభుత్వ ధ్రువీకరణ అందలేదన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి చేపట్టిన చర్యలతో ప్రభుత్వ వైఖరిపై ప్రజలు నమ్మకం, విశ్వాసం పెంచుకున్నారన్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో భాగంగా నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ప్రైమరీ, సెకండరీ, టెన్సనరీ మొదలైన మూడంచెల వ్యవస్థతో ముందుకు వెళుతున్నామని, వేములవాడలో వంద పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం కానుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సేవలు విస్తృత పరిచామన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన 40 డయాల్సిస్ సెంటర్లలో ఎంతో మంది పేదలు సేవలు పొందుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచడానికి బలంగా చర్యలు చేపట్టామని, ఈ నమ్మకం విశ్వాసం పెంచే బాధ్యత ప్రభుత్వ పెద్దలపై విధిగా ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని మరో పక్షం రోజుల్లో అందిస్తామని, స్వచ్ఛమైన తాగు నీటి వల్ల 80 శాతం జబ్బులు తగ్గుతాయని, ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన ఈ సమావేశానికి ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసి రాజమల్లు అధ్యక్షత వహించగా, అతిథులుగా వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సిరిసిల్లలో సోమవారం ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న మంత్రి కే.టీ.రామారావు