ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే కమలాదేవి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి (86) గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు రమేష్, మహేష్, హరేష్, కుమార్తె అనూరాధ ఉన్నారు. కమలాదేవి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున పామర్రు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈమె పిఏసీ ఛైర్మన్, టీటీడీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ సభ్యురాలుగా ఉన్న సమయంలో కాకినాడలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ఆలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె మృతి వార్త విన్న పలువురు నగరంలోని నగరపాలక సంస్ధ కార్యాలయం వెనుకనున్న స్వగృహంలో ఉంచిన భౌతిక కాయానికి లమాలలు వేసి నివాళులర్పించారు. కమలాదేవి అంత్యక్రియలు శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుమారులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కమలాదేవి (ఫైల్‌పొటో)