రాష్ట్రీయం

ఊరంతా ఖాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడుబూరు, నవంబర్ 9: ఊరు విడవామన్నది కరువు.. ఉరితాడై ఉన్నది పరువు.. నవధాన్యాల మాటేలేదు పల్లెల్లో.. వలవల ఏడ్పుల వలసల బాటల్లో...అన్న రీతిలో ఇళ్లకు తాళాలు వేసి ఊరు ఊరంతా వలసబాట పట్టింది. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం హులికన్వి గ్రామానికి చెందిన 400 మంది వలస కూలీలు గుంటూరుకు వలసెల్లిపోయారు. కర్నూలు జిల్లాలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులకు అద్దం పడుతోంది ఈ సంఘటన. హులికన్వి గ్రామం నుంచి గడిచిన మూడు రోజులుగా 300 మంది వలస వెళ్లారు. తాజాగా శుక్రవారం మరో వంద మంది కూలీలు పిల్లాపాపలతో కలిసి గుంటూరు సమీపంలోని బెల్లంపల్లికి వెళ్లారు. దీంతో ఊరుఊరంతా ఖాళీ అయినట్టయింది. తాళాలు వేసిన ఇళ్ల వద్ద వృద్ధులు మాత్రమే మిగిలారు. మహిళలు, పురుషులు నెత్తిన మూటలతో ఊరు వదిలి వెళ్తుండగా వారి తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ పోయిరమ్మని చెప్పే దృశ్యం కంటతడి పెట్టించింది. వలసల కారణంగా గ్రామంలో తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ఎన్నడులేని విధంగా ఈసారి తమ గ్రామస్థులు వలసబాట పట్టారని, ఊరు ఖాళీ అయిందని గ్రామపెద్దలు మహదేవ, నాగప్ప, సత్యన్న వాపోయారు. వలసలతో గ్రామం ఖాళీ అయిందని తెలిసినా సంబంధిత అధికారులు ఇటువైపు తొంగి చూడడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పనులు పూర్తిగా మందగించడం వల్లే కూలీలు వలస వెళ్లారు. ఉపాధి కరువై పస్తులుండలేక గుంటూరుకు వలస వెళ్తున్నట్లు వారు తెలిపారు. బెల్లంపల్లిలో పత్తి తీసేందుకు పిల్లాపాపలతో వెళ్తున్నామన్నారు. ముసలివారిని ఇళ్లవద్దే వదిలి వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. మండలంలోనే చిన్న గ్రామమైన హులికన్వి నుంచి అత్యధికంగా కూలీలు వలస వెల్లడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వలసల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే హులికన్వి గ్రామంలో ఇళ్ల వద్ద కాపలాగా ఉన్న ముసలివారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.