రాష్ట్రీయం

ప్రతిపక్షాల బ్రహ్మాస్త్రం ‘నోట్ల రద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలుచోట్ల కాంగ్రెస్ నిరసన.....
నోట్ల రద్దును ఎన్డీయేతర పార్టీలన్నీ కేంద్రంపై దాడి చేసేందుకు బ్రహ్మాస్త్రంగా ఉపయో గించుకుంటున్నాయ. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పార్టీల వరకూ అన్నింటికీ ఇదే ఓ ఆయుధమైంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, లభించిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రయత్నిస్తున్నాయ. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రోజును పురస్కరించు కొని శుక్రవారం ఆయుధాలను సంధించాయ. దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుని రెండు సంవత్సరాలు పూర్తయినా వాటి దుష్పరిణామాలు మాత్రం ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో శుక్రవారం నిరసనలు వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్, పంజాబ్ మంత్రి బల్బీర్ సింగ్ ఆధ్వర్యంలో చండీగఢ్‌లోని రిజర్వ్‌బ్యాంకు కార్యాలయ భవనం ఎదుట నిరసన తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జక్కర్ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం మన ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ముఖ్యంగా పలువురు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు చేసుకునే వారిని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిందని అన్నారు. తమ నిర్ణయంతో నల్లధనం వెలికివస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని, వాస్తవానికి ఇది బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజలను ఎన్నో ఇబ్బందులపాలు చేసే నిర్ణయం తీసుకున్న బీజేపీ నేతలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. కాగా కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ఆధ్వర్యంలో చండీగఢ్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సైతం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బన్సాల్ మాట్లాడుతూ నోట్ల రద్దు తర్వాత ఈ రెండేళ్లూ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతూనే ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కొమ్ముకాసే బడాపారిశ్రామికవేత్తలకే ఇది ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు.
అలాగే దేశంలోని బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల మొత్తం 10.50 లక్షల కోట్లకు చేరుకుందని, నోట్ల రద్దు వల్ల నల్లధనం వెనక్కి రాకపోగా, ఆర్థిక వ్యవస్థకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ఎన్డీఏ నిర్ణయాన్ని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ‘మంచి ప్రణాళికతో చేపట్టిన దోపిడీ’గా అభివర్ణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు.

చిత్రం:
=====
చత్తీస్‌గఢ్‌లోని కానె్కర్ జిల్లా పఖాన్జోర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఎన్డీఏ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని రాహుల్ దుయ్యబట్టారు. పెద్దనోట్ల రద్దు, ఆర్‌బీఐ, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలపై పెత్తనం వంటి దుశ్చర్యలకు మోదీ సర్కారు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.