రాష్ట్రీయం

మనగుడి సామగ్రికి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 9: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్టవ్య్రాప్తంగా అన్ని ఆలయాల్లో పూజాదికాలు జరపడానికి వీలుగా టీటీడీ అందిస్తున్న మనగుడి కార్యక్రమంలో ఉపయోగించే సంబారాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుంచి మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద మనగుడి సామగ్రిని ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, క్షేత్రస్థాయిలో భాగస్వాములను చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు తెలుగురాష్ట్రాల్లో ఎంపికచేసిన 13వేల ఆలయాల్లో 14వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మనగుడి కార్యక్రమంలో ప్రతి ఆలయానికి శ్రీవారి అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ, ఇతర పూజా సామగ్రిని ప్యాక్‌చేసి 13,000 బ్యాగులను ఆయా ఆలయాలకు డీపీపీ ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.