రాష్ట్రీయం

న్యాయం ప్రజలకు చేరువ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: న్యాయం ప్రజలకు చేరువ చేయాలని న్యాయవాదులు కోర్టులకు సహకరించాలని తద్వారా కేసులను సత్వరం పరిష్కరించేందుకు దోహదపడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హైకోర్టు నుండి పదోన్నతి పొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన న్యాయమూర్తి సుభాష్‌రెడ్డిని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ కార్యనిర్వాహక కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్ బీ. సుభాషణ్ రెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ. నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల్లో నిబద్ధత, కార్యదక్షత ఉండాలని పేర్కొన్నారు. న్యాయవాదులు కేవలం పిటిషన్లకే పరిమితం కాకుండా వారు కూడా న్యాయాధికారులుగా భాగస్వామ్యులు కావాలని, అందుకు అవసరమైన పోటీ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను గౌరవప్రదంగా నడిపించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో లా అకాడమిలు ఏర్పాటు చేయాలని, తద్వారా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అంతర్గత శిక్షణ అందించేందుకు ప్రభుత్వాలు దోహదం చేయాలని అన్నారు. కొత్తగా వృత్తిలోకి యువత వచ్చేందుకు ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పారు. ప్రభుత్వాలు మిగతా వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలను న్యాయవాదులకూ వర్తింపచేయాలని సూచించారు. తన గురించి చెబుతూ చిన్నప్పటి నుండి ఎంతో అభిరుచితో, మక్కువతోనే తాను న్యాయవాద వృత్తిలోకి వచ్చానని, వివిధ అంచెల్లో పదోన్నతులు పొంది నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యానని, తాను ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. సీనియర్ జస్టీస్ బి సుభాషణ్ రెడ్డి గారి దగ్గర తాను ఎంతో నేర్చుకున్నానని, న్యాయవాదులు బార్ - బెంచ్ సత్సంబంధాలను కొనసాగించాలని చెప్పారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా పొరాడుతున్నామని కమిటీ అధ్యక్షుడు అనంతరెడ్డి చెప్పారు.

చిత్రం.. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ కార్యనిర్వాహక కమిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి