రాష్ట్రీయం

పోలింగ్ ముందు.. పేలుళ్ల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 11: మరికొన్ని గంటల్లో చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగనున్న తరుణంలో ఆదివారం మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏకకాలంలో వరుసగా ఆరు పేలుళ్లు జరిపి ఓటర్లను భయభ్రాంతుల్ని చేసే ప్రయత్నం చేశారు. వరుసగా ఆరు మందుపాతరలను పేల్చడంతో బీఎస్‌ఎఫ్ ఎస్సై ఒకరు మృతి చెందారు. మరో ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. కాంకేర్ జిల్లాలోని కోయిలీబేడా పోలీసు స్టేషన్ సమీపంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. కూంబింగ్ బలగాలు సంచరిస్తున్న క్రమంలో మందుపాతరలు పేల్చడంతో బీఎస్‌ఎఫ్ ఎస్సై మహేంద్ర సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా ఆయన మృతి చెందాడు. కాగా బీజాపూర్ జిల్లా బెడ్రే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ అవస్థీ ప్రకటించారు. అటు మావోల బహిష్కరణ, ఇటు బలగాల భద్రత నడుమ తొలివిడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దునున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఆదివారం చెక్కలపై నినాదాలు రాసి చెట్లకు మేకులతో వేలాడదీశారు. మతోన్మాద భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లను తరిమికొట్టాలని, ఎన్నికలను బహిష్కరించాలని వాటిలో మావోయస్టులు పిలుపునిచ్చారు.

చిత్రం..ఎన్నికల విధులకు బయలుదేరిన సిబ్బంది