రాష్ట్రీయం

నేడు కేసీఆర్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం 2.34 గంటలకు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఫామ్‌లో ఉన్న కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు నంగునూరు మండలంలోని కోనాయిపల్లికి హెలిక్యాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తారు. అక్కడి నుంచి గజ్వేల్‌కు చేరుకుని మధ్యాహ్నం సరిగ్గా 2.34 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. కేసీఆర్ మొదటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మొదట కోనాయిపల్లి వెంకన్నను సందర్శించుకుని పూజలు నిర్వహించాకే నామినేషన్ దాఖలు చేయడం అనవాయితీ. శాసనసభను రద్దు చేశాక హుస్నాబాద్ సభలో ఎన్నికల శంఖారావాన్ని మోగించడానికి ముందు కూడా కేసీఆర్ కోనాయిపల్లికి వెళ్లి వెంకన్నను దర్శించుకున్న విషయం తెలిసిందే.