రాష్ట్రీయం

ఆరోగ్యానికి చిరునామా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్యానికి చిరునామాగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాక్షించారు. పేదవారి ఆరోగ్యం బాధ్యత ఆశా వర్కర్లు చూసుకుంటే, వారి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆషా వర్కర్ల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను చూస్తే ఒక ధైర్యం, ఒక ఉత్తేజం వస్తుందని, గ్రామాల్లో ఎమ్‌ఎమ్‌ఆర్, ఐఎమ్‌ఆర్‌ల మరణాలు ఇక ఉండబోవని అందుకు ఆశా వర్కర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని అభిలషిస్తున్నానన్నారు. ఆశా వర్కర్లకు ఒక జీవితం ఉంటుందని, వారి కుటుంబాలను మీరు పోషించుకోవాలని గుర్తించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఆశా వర్కర్లకు కనీస ఆదాయం ఉండాలని నెలకురూ. 3వేల గౌరవ వేతనంతోపాటు రూ. 3వేలు ఇన్‌సెన్‌టివ్ వచ్చేలాగా చేసి మొత్తం రూ. 6వేలు పొందే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఆశా వర్కర్లకు వివిధ రాష్ట్రాల్లో పంజాబ్‌లో రూ. 1000, కర్నాటకలో రూ. 1000, కేరళ రూ. 1500, మధ్యప్రదేశ్ రూ. 1500, చత్తీస్‌గఢ్ రూ. 4వేలు, తెలంగాణ రూ. 6వేలు - రూ. 7వేలు ఇస్తుంటే రాష్ట్రంలో ప్రతి ఆశా కార్యకర్త రూ. 8,600 తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. 2022 నాటికి అగ్రగ్రామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి అభివృద్ధికి చిరునామాగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా ప్రపంచానికి ఏపీ ఆదర్శంగా ఉండేలా ఒక విజన్‌తో పని చేస్తున్నామన్నారు. ఇది సాధ్యమా అంటే సాధ్యమేనన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి సంరక్షణా చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆడబిడ్డ గర్భం దాల్చిన దగ్గర నుంచి శిశువుకు జన్మనిచ్చే వరకు ఆరోగ్య జాగ్రత్తలు కల్పిస్తూ, జన్మించిన తరవాత తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇంటికి పంపిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఆసుపత్రుల్లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించామన్నారు. రూ. 600 కోట్లతో రాష్ట్రంలోని 59 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1200 బెడ్స్‌ను అదనంగా వేస్తున్నామన్నారు. పేద వారికి ఆరోగ్య ఖర్చులు తగ్గించడానికి 7,500 సబ్‌సెంటర్లలో ఈ-డ్యాష్ సబ్ సెంటర్ పెట్టి కనీసం మూడు బెడ్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశా కార్యకర్త డీ విజయలక్ష్మీకి ఉత్తమ ఆశా అవార్డు, కే లక్ష్మీ, జీ రాజకుమారి, సూర్యకుమారి, వజ్రమ్మ, ఎస్ మేరి, వీ చిలువకుమారి, దేవదానం, విజయలక్ష్మీ, అనిత, విజయలక్ష్మీ, వెంకటలక్ష్మీ, కేవీ రత్నమ్మలకు వివిధ విభాగాల్లో అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ముఖ్యమంత్రిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కిడారి శ్రావణ్‌కుమార్, దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు టీడీ జనార్ధన్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, 13 జిల్లాల నుంచి వచ్చిన ఆశా వర్కుర్లు తదితరులు పాల్గొన్నారు.