రాష్ట్రీయం

బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: బీజేపీ, టీఆర్‌ఎస్‌కు సిద్ధాంతపరమైన విరోధం ఉండటంతో భవిష్యత్‌లో మోదీతో కలిసే ప్రసక్తేలేదని అపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఇక్బాల్ మినార్‌ను కట్టిందీ కేసీఆరేనని గుర్తు చేశారు. షాదీ ముబారక్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, రంజాన్, బక్రీదు పండుగలకు చేయూత వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఆయనేన్నారు. తనకు తెలిసి కేసీఆర్‌ను మించిన లౌకికవాది మరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మైనార్టీ నాయకుడు అబిద్ అలీ ఖాన్, ఖలీల్ ఉర్ రెహమాన్ తమ అనుచరులతో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచి తమ అధినేత కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకుగాను 16 గెలుచుకుని జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. అబిద్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ, తాను 32 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నలలో పని చేస్తోన్నట్టు ఉందన్నారు. ముస్లింలు ఎన్నికల్లో గెలువరని కాంగ్రెస్ పార్టీ తమకు టికెట్లు ఇవ్వడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్ అలీకి మాత్రమే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించింది టీఆర్‌ఎస్స్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. మొన్నటిదాకా బీజేపీతో ఉన్న చంద్రబాబును ముస్లింలు నమ్మడం లేదని విమర్శించారు. ఎమ్మాల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ తాను మూడేళ్ల కిందటనే కళ్లు తెరిచి టీఆర్‌ఎస్‌లో చేరనన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో అబిద్ ఖాన్‌కు తెలిసిపోవడం వల్లనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ, గాంధీభవన్ నుంచి కార్యకర్తలను బయటికి పంపించి బౌన్సర్లను రక్షణగా పెట్టుకున్నారని, ఇక కాంగ్రెస్ పార్టీకి మిగిలేది బౌన్సలర్లేనని ఎద్దేవా చేశారు.