రాష్ట్రీయం

16మంది ఐఏఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 16మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న జె మురళిని పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, డయిరీ డెవలప్‌మెంట్ ఎండిగా బదిలీ చేశారు. విజయనగరం జెసి రామారావును సిసిఎల్‌ఎ జెసిగా నియమించారు.
ఏపీ భవన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో పనిచేస్తున్న శే్వతా తియోతియాను వైఎస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ లత్కర్ హరికేష్ బాలాజీరావును విజయనగరం జిల్లా జెసిగా నియమించారు. పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గానూ ఆయన వ్యవహరిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ మల్లిఖార్జునను సిఆర్‌డిఏ అదనపు కమిషనర్‌గా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్‌కలెక్టర్ విజయరామరాజును రాజమండ్రి పట్టణ కమిషనర్‌గా నియమించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జి శ్రీజనను విజయవాడ సబ్‌కలెక్టర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విజయకృష్ణన్‌ను రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా నియమించారు. అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పట్టన్‌శెట్టి రవి సుభాష్‌ను నియమించారు. తిరుపతి సబ్‌కలెక్టర్‌గా హిమాంశు శుక్లా నియమితులయ్యారు. కుక్కనూరు సబ్‌కలెక్టర్‌గానూ, కెఆర్ పురం ఐటిడిఏ పిఓగా సాగిలి షాన్ మోహన్‌ను నియమించారు. పాడేరు సబ్‌కలెక్టర్‌గా శివ శంకర్ లోతేటిని నియమించారు. జి లక్ష్మీషాను నూజివీడు సబ్ కలెక్టర్‌గా నియమించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టర్‌గా క్రితికా బత్రాను నియమించారు. నర్సాపురం సబ్‌కలెక్టర్‌గా ఎఎస్ దినేష్‌కుమార్ నియమితులయ్యారు.