రాష్ట్రీయం

కార్యాలయాలు ఖాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతలో ఎంత మార్పు. నిన్నటి వరకూ సంచలన వేదికలు. నేడు నిశ్శబ్ద వాటికలు. టికెట్లు ఎందుకివ్వరని ఆశావహులు సృష్టించిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. పెట్రోలు క్యాన్‌లు. కిరోసిన్ సీసాలతో ఆత్మాహుతి యత్నాలకు ఇవే మూగ సాక్షాలు. టవర్లెక్కి అభ్యర్ధులు సాగించిన నిరసనలకు, పెట్టిన శాపనార్ధాలకూ ఇవే కూడళ్లు. అలాంటిది హైదరాబాద్‌లోని రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు ఖాళీ అయ్యాయి. నేతల జాడ లేదు. ఆశావహుల అరుపులూ, కేకలూ అంతకంటే లేవు. కారణం నామినేషన్ల ఘట్టం ముగియడంతో అవకాశాలు అడుగంటిపోవడమే! ఎంతైనా అవకాశం ఉన్నంత వరకే ఆరాటం. ఆ తర్వాత బతుకు పోరాటమే!

చిత్రాలు.. గాంధీ భవన్
* ఎన్‌టీఆర్ భవన్
* తెలంగాణ భవన్
* బీజేపీ కార్యాలయం
* టీజేఎస్ భవన్