రాష్ట్రీయం

గోదావరి తీరంలో కార్తీక దీప కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 19: కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి తీరం దీపకాంతులతో శోభాయమానంగా మారింది. కార్తీక మాసం శివదేవుని పూజలకు ప్రశస్తి. అందులోనూ సోమవారం మహాదేవునికి మరింత ప్రీతిపాత్రమైనది కావడంతో మహిళలు దీపాలు వదలడానికి ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజాము నుండే గోదావరి తీరం మహిళలతో కిటకిటలాడింది. అంటూ గోదావరి నదీ తీరంలోని పురాణ ప్రాశస్థ్యం కలిగిన శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ హరహర మహాదేవ శంభోశంకర అనే శివనామ స్మరణతో మార్మోగాయి.పురాణ ప్రాశస్థ్యం కలిగిన రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్‌లతో పాటు సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్‌లు మరింత రద్ధీగా కన్పించాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని నాలుగు పంచారామ క్షేత్రాలతోపాటు రాజమహేంద్రవరంలోని ఉమా కోటిలింగేశ్వరస్వామి, ఉమా మార్కండేయేశ్వరస్వామి, విశే్వశ్వరస్వామి, ఉమా రామలింగేశ్వరస్వామి తదితర క్షేత్రాల్లో భక్తులు బారులు తీరారు. అష్టాదశ శక్తి పీఠాలైన పిఠాపురం పురూహితిక అమ్మవారు, ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ అమ్మవారి క్షేత్రాలు, పాదగయ, కోటిపల్లి, క్షణ ముక్తేశ్వర స్వామి, వాడపల్లి కొప్పేశ్వరస్వామి, కుండళేశ్వరంలలో భక్తులు కిటకిటలాడారు. కార్తీక మాస రెండో సోమవారం ఏకాదశి, ద్వాదశి కలిసి రావడంతో మరింత విశేషమైన పర్వదినంగా భావించి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాసాలతో దైవదర్శనం చేసుకున్నారు. చిలుకు ఏకాదశి, జీవోద్ధాన ఏకాదశి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చండీహోమాలు, లక్షపత్రి పూజలు, విశేష పూజలతోనూ, రుద్రాభిషేకాలతో భక్తులు తరించారు.

చిత్రం..కార్తీక దీపాల కాంతుల్లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్