రాష్ట్రీయం

దొరల పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 19: ప్రజల హక్కులను హరించివేసిన కేసీఆర్ దొరతనానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, పార్టీ ఇంచార్జ్ సలీం అహ్మద్‌లతో కలిసి బహిరంగ సభలో మాట్లాడుతూ అహంకారంతో, దౌర్జన్యంతో అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. తమను ఎదిరించిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ప్రశ్నించిన వారిని నిలువరించడం టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన దారుణాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే మహాకూటమి ఏర్పడిందని, డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా ప్రజలు మహాకూటమికి బ్రహ్మరథం పట్టనున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వడ్డీలేని రుణం, రెండులక్షల రైతు రుణమాఫీ, ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల రెట్టింపు లాంటి కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల అహంకార పాలనకు చరమగీతం పాడేందుకే చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్‌తో కలిసి వచ్చారని వెల్లడించారు.
కులమతాలకతీతంగా దొరల పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా మహాకూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అది తట్టుకోలేక తామేదో అభివృద్ధికి అడ్డుపడుతున్నామని టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ అవినీతిని ప్రజల ముందు పెడుతామన్నారు. ఈ కార్యక్రమంలో భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, టీడీపీ నేత వాసిరెడ్డి రామనాథం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతున్న భట్టి