రాష్ట్రీయం

సుప్రీంకోర్టూ వద్దంటారేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం: తన అక్రమ ఆస్తులు, అవినీతి మంత్రులను కాపాడుకునేందుకు సీబీఐని వద్దంటున్న చంద్రబాబు సుప్రీంకోర్టుతో రాష్ట్రానికి సంబంధం లేదని అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. మంగళవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన అవినీతిని పాలనను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర సంస్థ సీబీఐతో రాష్ట్రానికి సంబంధం లేదని ప్రకటించిన చంద్రబాబు రేపు సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగితే సంబంధం లేదని తప్పించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఇన్‌కంటాక్స్, ఈడీ సోదాలపై సుప్రీంకోర్టుకు వెళతానన్న బాబు ఆపరేషన్ గరుడపై ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లో తాను నడుస్తున్నానని చెబుతున్న చంద్రబాబు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు నిర్వహిస్తే అసలు దొంగ చంద్రబాబు అని బయట
పడుతుందన్న భయంతో విచారణకు ముందుకు రావడం లేదన్నారు. ప్రత్యేక హోదా పేరుతో మోదీ, కేంద్రం అంటూ రోజుకో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలి జాతీయస్థాయిలో ఫ్రంట్ అంటూ మోదీని దించేస్తానంటూ రోజుకో నేతను కలవడం కేవలం చంద్రబాబు డ్రామాలన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో మైనస్ వర్షపాతం నమోదై రైతులు కరవు, కాటకాలతో అల్లాడిపోతుంటే కర్ణాటకలో కుమారస్వామితో టీతాగి, తమిళనాడులో స్టాలిన్‌తో సాంబారు ఇడ్లీ తిని, బెంగాల్‌లో మమతాబెనర్జీతో మాట్లాడి నాలుగు ఫొటోలు తీయించుకుని పేపరులో ప్రకటించుకోవడమే తప్ప ఒరిగేదేముందని ప్రశ్నించారు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి ఒక్క మంచిపనైనా సాధించారా? అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వాటి ఆస్తులను కొల్లగొడుతోందన్నారు. పోలవరం పునాదులు దాటలేదని, అమరావతి బొమ్మలకే పరిమితమని, కరెంట్, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. తాను అధికారంలోకి వస్తే 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని, చేయూతలో భాగంగా మహిళలకు డ్వాక్రారుణాల మాఫీ, 75వేలు వ్యక్తగత రుణం, పిల్లల చదువుకు 15వేలు, ఉన్నత చదువులకు లక్ష రూపాయలు, 60 ఏళ్లు దాటిన వారికి 2వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణీ, రాజన్నదొర, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వైకాపా నాయకులు పరిక్షిత్‌రాజు, మాధవి, కరుణాకరరెడ్డి, జోగారావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయనగరం జిల్లా కురుపాం బహిరంగ సభలో మాట్లాడుతున్న వైసీపీ అధినేత జగన్