రాష్ట్రీయం

విశే్వశ్వర్‌రెడ్డి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖరరావుకు కొండా మూడు పేజీల లేఖను ఆయన పార్టీ కార్యాలయానికి పంపించారు. ఎన్నికల సమయంలో కొండా విశే్వశ్వర్‌రెడ్డి రాజీనామా టీఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. వారం రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. అయితే తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతుందని, టీఆర్‌ఎస్‌లోనే కొనసాగనున్నట్టు కొండా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విశే్వశ్వర్‌రెడ్డి రాజీనామా చేయడమే కాకుండా టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు దూరమవుతోందని, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదని తన లేఖలో ఘాటుగా విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని కూడా ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. తన రాజీనామాపై మీడియా సమావేశంలో వెల్లడిస్తానని కూడా కొండా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడమే కాకుండా ఈ నెల 23న మేడ్చల్‌లో జరిగే
బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారని విశే్వశ్వర్‌రెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం. ఇలా ఉండగా తన రాజీనామాకు ఐదు కారణాలున్నట్టు లేఖలో కొండా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, యువకులు ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో ఆదే ఆకాంక్షతో తాను కూడా ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. 2014 ఎన్నికలకు ముందు చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ స్వయంగా తనను కోరారన్నారు. అయితే అప్పుడది టీఆర్‌ఎస్ ఓడిపోయే సీటుగా భావించారన్నారు. అయినప్పటికీ కేసీఆర్ ఆదేశం మేరకు ఎన్నికల బరిలో నిలిచి సర్వశక్తులు ఒడ్డి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో తన వాణిని వినిపించానన్నారు. అయితే గడిచిన రెండు సంవత్సరాలుగా పార్టీ వైఖరిని గమనిస్తే ప్రజలకు పార్టీకి మధ్య అంతరం పెరిగిందని, ప్రజలు దూరం అవుతున్నట్టు గ్రహించానన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, కార్యకర్తలకు పార్టీలో స్థానం లేదని అర్థమైందన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు మాత్రం పార్టీలో అందలం ఎక్కించి ఏకంగా మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా టీఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. వ్యక్తిగతంగానే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు, కార్యకర్తలకు, నియోజకవర్గానికి, రాష్ట్రానికి, పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగడం వంటి ఐదు కారణాలతో పార్టీని, ఎంపీ పదవిని వీడుతున్నట్టు విశే్వశ్వర్‌రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. ఇంతకాలంగా తన వెంట నడిచిన, తన పట్ల అభిమానం చూపిన శ్రేణులు మున్ముందు తాను వేయబోయే అడుగులో కూడా వెన్నంటి ఉంటారన్న ఆశాభావాన్ని కొండా వ్యక్తం చేశారు.
చిత్రం..కొండా విశే్వశ్వర్‌రెడ్డి