రాష్ట్రీయం

మా ఆస్తుల విలువ రూ.88.66 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబ ఆస్తులను ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి 88.66 కోట్ల రూపాయల మేర నికర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఉండవల్లి ప్రజావేదికలో ఈ వివరాలను బుధవారం మీడియా సమావేశంలో మంత్రి ప్రకటించారు. చంద్రబాబుకు 8.31 కోట్ల రూపాయల మేర ఆస్తులు, 5.31 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. నికరంగా 2.99 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 8 కోట్ల రూపాయల విలువ చేసే నివాస గృహం, నారావారిపల్లెలో 23 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు ఉంది. ఒక అంబాసిడార్ కారు, బ్యాంక్‌లో 4.83 లక్షల రూపాయల నగదు ఉంది.
ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరికి 53.37 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉండగా, 22.35 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. నికరంగా 31.01 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నాయి. తమిళనాడులో 1.86 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు, 3.5 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 42.41 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి.
లోకేష్‌కు 27.29 కోట్ల రూపాయల ఆస్తులు, 5.88 కోట్ల రూపాయల అప్పులు ఉండగా, నికర ఆస్తుల విలువ 21.46 కోట్ల రూపాయలు. బ్రాహ్మణికి 13.38 కోట్ల రూపాయల ఆస్తులు, 5.66 కోట్ల రూపాయల అప్పులు ఉండగా, నికర ఆస్తుల విలువ 7.72 కోట్ల రూపాయలు. 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 310 క్యారెట్ల వజ్రాలాభరణాలు, 97.4 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. దేవాన్ష్ పేరున 18.71 కోట్ల రూపాయలు, కుటుంబానికి చెందిన నిర్వాణ
హోల్డింగ్స్‌కు 6.83 కోట్ల రూపాయల మేర నికర ఆస్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. హెరిటేజ్ నికర లాభం 60.38 కోట్ల రూపాయలని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా 8 సంవత్సరం తమ కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో విలువలు పెరగాలని ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. మార్కెట్ ధర కాకుండా కొన్న ధర ఆధారంగా ఆస్తుల విలువ ప్రకటిస్తున్నామన్నారు. హెరిటేజ్‌ను సొంత ఆదాయం కోసం స్థాపించారన్నారు. వైఎస్సాఆర్ తమపై, తమ కంపెనీలపై ఎన్ని కేసులు పెట్టినా, నిరూపించలేకపోయారన్నారు. ప్రకటించిన దాని కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నట్లు నిరూపించిన వారికి రాసిస్తానని సవాల్ చేశారు.

చిత్రం..వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్