రాష్ట్రీయం

హాయ్‌ల్యాండ్ ముట్టడి భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/గుంటూరు, నవంబర్ 21: అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం చేపట్టిన హాయ్‌ల్యాండ్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కాకాని వరకు పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పలువురు నాయకులు, బాధితులు ముస్లిం మహిళల మాదిరిగా బుర్కాలు ధరించి హాయ్‌ల్యాండ్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌కుమార్, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో సహా మొత్తం 266 మంది ఆందోళనకారులను అరెస్ట్‌లు చేసి తాడేపల్లిలోని సిఎస్‌ఆర్ కళ్యాణ మండపం, గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లకు
తరలించారు. అక్కడ వారికి భోజన సదుపాయాలు కూడా పోలీసులు ఏర్పాటుచేశారు. జిల్లా అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు సారధ్యంలో హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్‌పోస్టులు, అర్బన్ జిల్లావ్యాప్తంగా 50 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ముట్టడికి వచ్చే ఆందోళనకారులను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలపై చేరుకున్న నాయకులు కాజ టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు సిద్ధంకాగా అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ముట్టడికి ఒక రోజు ముందుగానే జిల్లావ్యాప్తంగా ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. ముట్టడికి అనుమతి లేదంటూ, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, శాంతిభద్రతలకు సహకరించాలంటూ అగ్రి బాధితులు, నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా హాయ్‌ల్యాండ్‌కు వెళ్లే మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఇతర నేతలను ప్రకాశం బ్యారేజీ వద్దనే అరెస్టు చేసి కృష్ణాజిల్లా తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విజయవాడ, గుంటూరు రైల్వే, బస్సుస్టేషన్లలో దాదాపు 700 మందిని అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషనులకు తరలించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 15న లోపు సొమ్ములు చెల్లింపునకు ప్రభుత్వం కోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందకపోతే తనతో పాటు పలువురు నాయకులు నిరవధిక నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకునేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న బాధితులను దౌర్జన్యంగా అరెస్టు చేయటం దారుణమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు మాట్లాడుతూ బాధితులు డిపాజిట్ చేసిన ప్రతి పైసాను తిరిగి చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాఉంటే న్యాయం కోసం ఆందోళనకు దిగిన అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం నిర్బంధించటాన్ని పది వామపక్షాల నేతలు తీవ్రంగా ఖండించారు.

చిత్రాలు.. హాయ్‌ల్యాండ్ ముట్టడికి బయలుదేరిన ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేస్తున్న పోలీసులు