రాష్ట్రీయం

మహాకూటమితో కేసీఆర్‌కు వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 21: మహాకూటమితో కేసీఆర్‌కు వణుకు పుడుతున్నదని.. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసిన కేసీఆర్ రాష్ట్రంలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మాకేంటని ప్రగల్భాలు పలికి ఇప్పుడు పొత్తులపై మాట్లాడటం హాస్యాస్పదమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్‌లో సోనియా సభ స్థలాన్ని పరిశీలించిన ఉత్తమ్ విలేఖరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ఎందుకు మోదీకి అమ్ముడుపోయాడని, రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎందుకు ఓటు వేశారని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లులోని అంశాలను ఎందుకు సాధించడం లేదని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలు ఇకముందు సాగవని కేసీఆర్, కేటీఆర్‌ల మాస్క్‌ల వెనుక నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులయ్యారని, రాష్ట్రంలో మైనారిటీలను కేసీఆర్ మోసం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మైనారిటీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్‌ల పేరుతో దోఖా చేశారని విమర్శించారు. మేడ్చల్‌లో 23న నిర్వహించే సోనియా - రాహుల్‌గాంధీ సభ ఆషామాషీ సభ కాదని.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ సభ నాంది కానుందని టీపీసీసీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సభ విజయవంతం కోసం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యావత్ దేశం సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌కు మంచి నిర్మాణ వ్యవస్థ ఉందని చెప్పారు. ఒక్క ఫోన్ మెసేజ్‌తో వేలాది మంది కార్యకర్తలు సమావేశానికి హజరయ్యేంత నిర్మాణ వ్యవస్థ ఉందని వివరించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త సైనికునివలే పాటుపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో గెలుపే కీలకం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఎంతో కీలకమని.. గెలుపుతో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయని ఏఐసీసీ సభ్యుడు మధుయాష్కీ అన్నారు. రాష్ట్ర సాధన సోనియా తెలంగాణ బిడ్డల తల్లిగా భావించడంతో జరిగిందని పేర్కొన్నారు. సోనియా తెలంగాణకు రావడం ప్రజలు అదృష్టంగా భావించి ఆమెకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశంగా భావించాలని అన్నారు. కేంద్ర నిఘావర్గాల రిపోర్టు కూడా టీఆర్‌ఎస్‌కు 27 సీట్లకు మించి లేదని చెప్పారు. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ నాయకులు బోసు రాజు, రుద్రరాజు, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్‌ఆర్ పాల్గొన్నారు.
బుధవారం రాత్రి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. సోనియా - రాహుల్‌గాంధీ సభ నిర్వహణపై ముఖ్య నాయకులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు.
చిత్రం..మేడ్చల్‌లో మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి