రాష్ట్రీయం

ప్రధాని దేశ ప్రజల్లో విశ్వాసానిచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: భారతీయ జనతా పార్టీలో ఇటీవల చేరిన స్వామి పరిపూర్ణానంద పూర్తిస్థాయిలో పార్టీ అభ్యర్ధుల కోసం ప్రచారం చేస్తున్నారు. దాదాపు రోజంతా బీజేపీ అభ్యర్థుల విజయం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ నెల 22 నుండి వరుసగా ఆయన 38 పట్టణాల్లో జరిగే ప్రదర్శనలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బీజేపీ విజయాన్ని సవాలుగా తీసుకున్న స్వామి పరిపూర్ణానంద బుధవారం నాడు అమీర్ పేట నుండి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా వందలాది మంది స్వామిని చూడటానికి మెట్రో స్టేషన్లకు వచ్చారు. అమీర్‌పేట నుండి ఆయన ఎంజీబీఎస్ వరకూ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగాతోటి ప్రయాణీకులతో ఆయన ముచ్చటించారు. రాజకీయాలపై వారి అభిప్రాయాలను, ఎన్నికల సందర్భంగా ఓటర్ల ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులు స్వామిని చూడటానికి ఆయన ఆశీస్సుల కోసం ఎగబడ్డారు. ప్రయాణానికి ముందు స్వామి అమీర్‌పేటలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావిస్తూ, దేశంలో వేగంగా మారిపోతున్న పరిస్థితుల్లో హిందువులు అంతా ఐక్యమై ధర్మాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. హిందువులు తమ గొంతు విప్పడానికి భయపడే పరిస్థితులను స్థానిక ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని, మెజార్టీ హిందువులు మైనార్టీగా మారిపోయే ప్రమాదం ఆసన్నమైందని దీనిని అడ్డుకుని హిందువులు తమ సత్తా చూపాలంటే మత ఛాందసవాద పార్టీలతో చేతులు కలిపుతున్న పార్టీలను దూరంగా ఉంచాలని సూచించారు. కాగా స్వామి 22వ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల , ఎల్లారెడ్డి, మల్కాజ్‌గిరిల్లో పర్యటించి, ప్రజలతో కలుస్తారు. 23న దేవరకొండ, వరంగల్, ఆలేరు, పటాన్‌చెర్వు, సికింద్రాబాద్ కంటోనె్మంట్, చాంద్రాయన గుట్టల్లో పర్యటిస్తారు. 24వ తేదీన ముథోల్, నిజామాబాద్ రూరల్, సిద్ధిపేట, వేములవాడ, పెద్దపల్లి, సికింద్రాబాద్‌లలో పర్యటిస్తారు. 26న భద్రాచలం, నర్సంపేట, నల్గోండ, షాద్‌నగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, 27న సిర్పూరు, చెన్నూరు, కరీంనగర్, ఆర్మూరు, మెదక్, సనత్‌నగర్, 28న భూపాలపల్లి, ఇల్లెందు, నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్, నారాయణ పేట, మహేశ్వరం, 29న మహబూబాబాద్, మంచిర్యాల, ధర్మపురి, బోధన్, కామారెడ్డి, ఉప్పల్, ఆలంపూర్ పట్టణాల్లో పర్యటించి ఓటర్లను కలుసుకుంటారు.
చిత్రం..అమీర్‌పేట నుండి మెట్రో స్టేషన్‌లో పరిపూర్ణానంద