రాష్ట్రీయం

11 భాషల్లో ‘నీట్’ ప్రశ్నాపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో చేరడానికి నిర్వహించే నీట్ - యూజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు 11 భాషల్లో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వనున్నారు. ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలి, గుజరాతి, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నాపత్రాన్ని తయారుచేస్తున్నారు. గతంలో ఆంగ్లభాషలో మాత్రమే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేవారు, జాతీయ పరీక్ష కావడం జాతీయ స్థాయిలో గట్టి పోటీ ఉండటంతో, ప్రాంతీయ భాషల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని భావించిన సుప్రీంకోర్టు ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నాపత్రాలను అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ప్రాంతీయ భాషను ఎంచుకున్న వారికి అదే భాషలో ప్రశ్నాపత్రం ఇచ్చారు. కానీ గత ఏడాది తమిళం, తెలుగు, గుజరాతి భాషల్లో ప్రశ్నాపత్రం అనువాదం చేసినపుడు 180 ప్రశ్నల్లో 49 తప్పులు దొర్లాయని, వారికి వెయిటేజీ ఇవ్వాలని పరీక్షకు హాజరైన వారు డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు సైతం వారి అభిప్రాయాన్ని సమర్ధించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి ప్రాంతీయ భాషలను ఎంచుకున్న వారికి ఆయా భాషలతో పాటు ఆంగ్లంలోనూ ప్రశ్నాపత్రాన్ని అందుబాటులో ఉంచుతారు. ప్రాంతీయ భాషలో ఏదైనా ప్రశ్నలో స్పష్టత లేకపోతే దానిని ఆంగ్లంలో చదువుకుని సమాధానం రాయాల్సి ఉంటుంది. గతంలో సీబీఎస్‌ఈ ఈ పరీక్షను నిర్వహించగా, ఈ ఏడాది నుండి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించబోతోంది. గత ఏడాది నీట్‌కు 13 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో ఒక్క మార్కు తేడాతో రెండు మూడు వేల ర్యాంకు మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రతి మార్కు చాలా కీలకం కావడంతో అభ్యర్ధులు ఎలాంటి ఇక్కట్లు పడరాదనే భావనతో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే వారికి సైతం ఆంగ్లంలో ప్రశ్నాపత్రాన్ని అందించాలని నిర్ణయించింది.