రాష్ట్రీయం

హెచ్‌సియు పరిణామాలపై అసెంబ్లీలో కాంగ్రెస్, బిజెపి సంవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కు అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమం ద్వారానే తెలంగాణ సాకారం అయిందని, అలాంటి దళిత విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలో అన్యాయం జరిగితే ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడుతుందని ఆశిస్తే అలా జరగలేదని బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనలపై శనివారం శాసన సభలో హోంమంత్రి ప్రకటన చేసిన తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడారు. ఉస్మానియాలో ఒక వ్యక్తి ఆత్మహత్యతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, ఆత్మహత్య చేసుకున్నది విద్యార్థి అనే అనుమానంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగితే తాను పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నించినట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగిందని, రాహుల్‌గాంధీ రెండు సార్లు సందర్శించారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో స్పందించలేదని సంపత్ విమర్శించారు. సంపత్‌కుమార్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనపై టిఆర్‌ఎస్ ప్రభత్వాన్ని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించడంతో బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ దానికి సమాధానంగా కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. 12వందల మంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ జాతీయ నాయకులు సెంట్రల్ యూనివర్సిటీకి మాత్రం రెండుసార్లు వచ్చారని విమర్శించడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎల్‌పి ఉప నాయకుడు జీవన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో బిజెపి ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి లేచి కాంగ్రెస్ సభ్యులతో వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులు ఎన్ని విమర్శలు చేసినా తాము విన్నామని తమకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం తగదని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌మాతాకు జై అని నినదించే ప్రసక్తే లేదని ఒక ఎంపి అనడాన్ని ప్రభాకర్ ప్రస్తావించగా, ఎంఐఎం సభ్యులు ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఎంఐఎం పేరు ఎత్తకుండా ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం సభ్యులు పలు సందర్భాల్లో వాగ్వివాదానికి దిగారు.