రాష్ట్రీయం

ప్రజల జీవితాల్లో కోటి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: రాష్ట్రం సుభిక్షంగా మారి, ప్రజల జీవితాల్లో కోటి వెలుగుల కాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం రాత్రి నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనతో కోటి దీపోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు ఎంతో పవిత్ర భావనతో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తొలుత ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సభా వేదికపై దేవతామూర్తులకు ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. అనంతరం కోటి వత్తులతో ఏర్పాటు చేసిన దీపాన్ని ముఖ్యమంత్రి వెలిగించారు. సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9.40 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం తరపున
ఆలయ ఈఓ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. విద్యారంగం మహర్షి రూపకల్పన చేసిన మహామంత్రాన్ని జపించి మహాలక్ష్మికి ప్రజల సంక్షేమం కోరుతూ ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రామాంజనేయప్రసాద్, కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

చిత్రం..కోటి దీపోత్సవ సభావేదికపై మహాలక్ష్మి దేవికి పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు