రాష్ట్రీయం

ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 6: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ రాజ్యాంగానికి భిన్నంగా వ్వవహరిస్తోందని, ఆ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడు శతాబ్ధాలుగా దేశం రాజ్యాంగం ప్రకారం నడిచిందని, అయితే ప్రస్తుతం రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. ప్రధానిగా అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. బీజేపీ తిరిగి 2019లో అధికారంలోకి వస్తే బ్రిటీష్ పాలన వస్తుందని, అన్ని రంగాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. కేంద్ర మంత్రి వర్గం రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల పరంగా పనిచేయడం లేదని, కార్పొరేట్ వర్గాలకు కొమ్ముకాస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపడతారని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.24,350 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం వెయ్యి కోట్లు మాత్రమే మంజూరు చేసి వెనక్కు తీసుకోవడం బాధాకరమన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారని, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, అక్రంఖాన్, నాగేంద్ర పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరా