రాష్ట్రీయం

కరవు అంచనాకు కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/మదనపల్లె, డిసెంబర్ 6: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర కరవు అధ్యయన బృందం గురువారం పర్యటించింది. నెల్లూరు జిల్లాలోని కావలి డివిజన్‌లో ఈ బృందం పర్యటించి కరవు పరిస్థితులను ఆరా తీసింది. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెట్రిసెల్వి నేతృత్వంలో జిల్లా అధికారులు కావలిలో కరవు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేయగా, బృందంలోని అధికారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అక్కడ నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ప్రజలు, అందులోనూ ముఖ్యంగా రైతులు ఎంత నష్టపోతున్నదీ బృందానికి వివరించారు. వ్యవసాయ రంగానికి రూ.26.61 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.96 లక్షలు, పశుసంవర్ధ శాఖకు రూ.2.27 కోట్లు నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఆర్థిక సహాయంగా రూ.70.34 కోట్లు అవసరమని వారు బృందంలోని అధికారులకు స్పష్టం చేశారు. గత నాలుగేళ్ల నుండి జిల్లాలో పంటలు ఆశించినంత స్థాయిలో లేవని తీవ్ర వర్షాభావం వల్ల
ప్రతి ఏడాది పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ వివరాలను పరిశీలించిన బృందంలోని ప్రధాన అధికారి నీరజ అడిదామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి సాధ్యమైనంత త్వరగా కరవు సహాయక నిధులు విడుదలయ్యేందుకు సహకరిస్తామని జిల్లా అధికారులకు హామీనిచ్చారు.
కరవుతో అల్లాడుతున్నాం.. ఆదుకోండి:రైతులు
గత రెండేళ్లుగా కరవుతో అల్లాడుతున్నామని, ఉపాధి పనులకు అదనపు పనిదినాలు కల్పించాలని గురువారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర కరవు బృందానికి రైతులు ఏకరువు పెట్టారు. వ్యవసాయానికి నీళ్లు లేకపోవడంతో పాడి పరిశ్రమలపై ఆధారపడ్డామని, పాడి పరిశ్రమను ప్రోత్సహించి ఆదుకోవాలని కేంద్ర కరవు బృందానికి పాడి రైతులు విన్నవించారు. క్షేత్రస్థాయిలో చిత్తూరు జిల్లాలోని కరవును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులకు జిల్లా కరవు పరిస్థితులపై సీపీవో భాస్కర్ వివరించారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం తానావడ్డిపల్లె, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ, కెవీపల్లె మండలాలకు చెందిన రైతులు కరవు బృందానికి అర్జీలు సమర్పించారు.
చిత్రం..నెల్లూరు జిల్లాలో కరవు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న కేంద్ర కరవు అధ్యయన బృందం