రాష్ట్రీయం

మధుయాష్కీపై దాడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, డిసెంబర్ 6: మెట్‌పల్లి పట్టణంలో గురువారం రాత్రి మాజీ ఎంపి మధుయాష్కీపై దాడికి విఫలయత్నం చేశారు. కాంగ్రెస్‌లోని ఓ వర్గం, టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించగా ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ దాడిలో యాష్కీ కారు ధ్వంసమైంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గురువారం మెట్‌పల్లిలోని డాక్టర్ దస్తగిరి నివాసానికి వచ్చి తిరిగి కారులో వెళ్ళేందుకు యత్నించగా అప్పటికే కాంగ్రెస్‌లోని ఓ వర్గానికి చెందిన వారు టిక్కెట్ రాకుండా చేశారంటూ మధుయాష్కీతో వాగ్వాదానికి దిగారు. అసమ్మతి నేత అనుచరులతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు రాళ్ళతో దాడి చేయటంతో పరిస్థితిని గమనించిన మధుయాష్కీ తప్పించుకొని ద్విచక్ర వాహనంపై తప్పించుకున్నట్లు తెలిసింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు కొందరు మధుయాష్కీ కారును ధ్వంసం చేశారు. ఎస్సై శంకర్‌రావు అక్కడే ఉన్నా అదుపుచేయలేకపోయినట్లు తెలిసింది. ఈ సంఘటన జరిగిన తరువాత కోరుట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు సోదరుడు కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ మధుయాష్కీపై టీఆర్‌ఎస్ నాయకులు, కాంగ్రెస్ టికెట్ రాని అసమ్మతి నేతకు చెందిన నాయకులు దాడి చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమి భయంతోనే దాడి చేయించినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎన్నికల్లో గెలుపు మనదేనని వెల్లడించారు.

చిత్రం..మధుయాష్కీతో కాంగ్రెస్ అసమ్మతివాదుల వాగ్వివాదం