రాష్ట్రీయం

ముత్యపు పందిరిపై శ్రీకృష్ణావతారంలో.. మురిపించిన అలమేలుమంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీకృష్ణుని అలంకారంలో అలమేలుమంగ భక్తులను మురిపించింది. వాహన సేవ ముందుభాగాన అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ కొనసాగింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అడగడుగునా నారికేళం, కర్పూర హారతులు సమర్పించి తరించారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్ర నదీతీరంలో లభిస్తాయని అంటారు.
అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుందని భావిస్తారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య పద్మావతి దేవీకి ఊంజల్ సేవ వైభవోపేతంగా జరిగింది.
సింహ వాహనంపై సిరుల తల్లి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవల్లో భాగంగా మూడోరోజైన గురువారం రాత్రి అమ్మవారు సింహ వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. సింహం పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, వాహన శక్తికీ ప్రతీక. అమ్మవారికి సింహ వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది.
చిత్రం..ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు