రాష్ట్రీయం

ప్రయాణికులకు కనుల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: రైల్వే ప్రయాణికులను ఆహ్లాదపరచేందుకు దక్షిణ మధ్య రైల్వే వినూత్న ప్రయోగాలను చేపడుతోంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఏడు రైల్వే స్టేషన్లలో మొబైల్ డిజిటల్ సినిమాలను ప్రదర్శించనున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ మొబైల్ డిజిటల్ సినిమాలను శుక్రవారం ప్రారంభించారు. కాచిగూడతో పాటు మల్కాజ్‌గిరి, బొల్లారం, కామారెడ్డి, బాసర, కర్నూల్ (ఏపీ) మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లలో చిత్రాలు ప్రదర్శిస్తారు. హిందీ, తెలుగు భాషల్లో కొత్త పాత సినిమాలను వేస్తారు. మొబైల్ థియేటర్లలో 120 నుంచి 150 మంది ప్రయాణికులు కూర్చోడానికి వీలుంటుంది. దీని కోసం రైల్వే ప్రయాణికుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరు. పూర్తిగా ఉచితం. ఈ మొబైల్ సినిమాల స్క్రీన్ నిడివి 5.1 ఉంటుంది. సినిమాలతో పాటు విద్య, వైజ్ఞానిక రంగాలకు చెందిన చిత్రాలు ప్రదర్శిస్తారని రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్ వెల్లడించారు.