రాష్ట్రీయం

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: పోలవరం లక్ష్యాన్ని చేరుకోవడంలో రికార్డు సాధించాలనే ఆసక్తి ఇంజనీర్లలో చోటు చేసుకుంది. పనుల గమ్యం సాధించడంలో రికార్డుస్థాయి పనిచేయడం వల్ల తమకు తాము స్ఫూర్తిదాయంకం కావాలనే ప్రయత్నం ఇంజనీర్లలో కన్పిస్తోంది. ఈ మేరకు పోలవరం పనుల్లో గిన్నిస్ రికార్డు సాధించాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీంతో ఒకే రోజు భారీ కాంక్రీటును వేసేందుకు నిర్ణయించారు. పోలవరం కాంక్రీటు పనుల్లో ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. ప్రస్తుతం స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే స్పిల్ ఛానల్ ఒక చోట కిలోమీటర్ వెడల్పున కాంక్రీటు వేయాల్సి ఉంది. ఈ కాంక్రీటు పని ఒకేరోజు 20 వేల క్యూబిక్ మీటర్ల వేసి గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ నెల 17న ఈ కాంక్రీటు పనిచేసి రికార్డు సాధించాలని ముహూర్తం పెట్టారు. కానీ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో వాయిదా పడింది. ఈ గిన్నిస్ రికార్డు కాంక్రీటు పనిని జనవరికి వాయిదావేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి. జెట్ గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ పనులకు సంబంధించి మొత్తం 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయాల్సి వుండగా డిసెంబర్ 10వ తేదీ నాటికి 921.17 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగింది. ఈ మొత్తం పనులు 82.60 శాతం పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్‌కు
మొత్తం 19.73 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనిచేయాల్సి ఉండగా డిసెంబర్ 10 నాటికి 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనితో 53.60 శాతం పూర్తయింది. రేడియల్ గేట్లకి సంబంధించి ఫ్యాబ్రికేషన్ 18000 మెట్రిక్ టన్నులకు 11,170 మెట్రిక్ టన్నుల పని జరిగి ఈ పనులు 62.05 శాతం పూర్తయ్యింది. కాఫర్ డ్యామ్‌కు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ కటాఫ్ పనులకు సంబంధించి 3467 మీటర్లకు గాను 3462 మీటర్ల మేర నిర్మాణ ప్రాంతం స్థితగతులను బట్టి పూర్తయింది. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 77.81 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 0.97 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయి 1.25 శాతం పూర్తయింది. ఇక కనెక్టవిటీలకు సంబంధించి మొత్తం 59.65 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో ఎడమ కనెక్టవిటీలకు సంబంధించి 47.94 శాతం, కుడి కనెక్టవిటీలకు సంబంధించి 72.83 శాతం పూర్తయ్యింది. మొత్తం ప్రాజెక్టు గత నెల 10 నాటికి 62.16 శాతం పనులు పూర్తయ్యాయి.
24న మొదటి గేటు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి గేటును డిసెంబర్ 24న ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గేట్ల ఏర్పాటును ప్రారంభిస్తారని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 48గేట్లలో మొదటి గేటును 24న ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడంతో గేట్ల అమర్చే పని ప్రారంభమై మే నెలలోపు మిగతా గేట్లపని పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 16వ తేదీన 24 గంటల్లో 28,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని నవయుగ ఇంజనీరింగ్ సంస్థ నిర్ణయించిందన్నారు. అయితే తుపాను ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని జనవరి మొదటి వారానికి మార్చామన్నారు. ఇప్పటికే దుబాయ్‌లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన రికార్డు ఉందని, ఆ రికార్డును అధిగమించేందుకు కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 11.15 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు లక్ష్యంలో 9.24 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేశామన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో రూ. 10,069 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేశామని, గతంలో 10 సంవత్సరాల్లో రూ. 5,136 కోట్లు ఖర్చు చేయగా మొత్తం ఇప్పటి వరకు రూ. 15,205 కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ. 6,727 కోట్లు కేంద్రం ఇచ్చిందని, ఇంకా రూ. 3,342 కోట్లు విడుదల చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన బకాయి నిధులతో నిర్వాసితులకు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు చెల్లించాల్సి ఉందన్నారు.