రాష్ట్రీయం

కృష్ణపట్నం రేవుద్వారా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, మార్చి 28: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఓడరేవు అయిన ఓడరేవు ద్వారా ఇండియా-బంగ్లాదేశ్‌ల మధ్య తొలిసారిగా సముద్రయానం ద్వారా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు వేదికగా నిలిచింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవి హార్బర్ కంటైనర్ నౌక ఓడరేవులో లంగరు వేయడంతో ఈనౌకను సోమవారం జిల్లా కలెక్టర్ ఎం జానకి ప్రారంభించారు. తొలుత కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ భవనంలోని దసపల్లాస్ హోటల్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వాణిజ్య కార్యకలాపాలపై సమగ్రమైన విషయాలను పోర్టు సిఇఓ అనిల్‌కుమార్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు.
ఈసందర్భంగా ఓడరేవు సిఇఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందానికి 1974వ సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు చేశారని, నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోది గత సంవత్సరం ఢాకా పర్యటనలో పునరుద్ధరించారని సిఇఓ తెలిపారు. ఇరుదేశాల షిప్పింగ్ డిపార్ట్‌మెంట్ల నుంచి మొట్టమొదటి సారిగా అంగీకార పత్రాలు బంగ్లాదేశ్ కంటైనర్‌నౌక పొందిందని అన్నారు.
పోర్టు నుంచి బంగ్లాదేశ్ ప్లైయాష్, సిమెంట్, టెక్సైటైల్స్ ఇతర వస్తువులను సముద్రమార్గం ద్వారా కేవలం ఐదు రోజుల్లో చేరవేస్తామని సిఇఓ అన్నారు. జలమార్గం ద్వారా సరిహద్దులు విశాలంగా ఉండడం, రవాణా ఖర్చు తగ్గడం, తద్వారా ఉత్తమ ధరలను పొందవచ్చని సిఇఓ అభిప్రాయపడ్డారు. అలాగే కస్టమ్స్ డాక్యుమెంటేషన్ తగ్గించడానికి ఒప్పందంచేసుకోవడంతోపాటు సులభంగా కార్గొ కదలికలు జరిపేలా ఆయా దేశాల్లో ఎగ్జిట్‌పాయింట్ వద్దనే కస్టమ్స్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక శాతం కార్గొ ఇప్పుడు రోడ్డు మార్గంనుంచి సముద్ర మార్గం ద్వారా జరగడంతోపాటుగా ఎగుమతి దారులు రవాణా పరంగా లబ్ధిపొందుతారని ఆయన అన్నారు.
అనంతరం కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ డైరెక్టర్ వినుత వెంకటేష్ మాట్లాడుతూ బెంగళూరునుంచి బంగ్లాదేశ్‌తో వాణిజ్యం జరిపే ఎగుమతి దిగుమతిదారులు ఐసిడి బెంగళూరు నుంచి వీక్లీ ట్రెల్ సర్వీస్ ద్వారా రోడ్డు సేవలను ఉపయోగించుకుని లబ్ధిపొందవచ్చని ఆయన అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జానకి మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవు ద్వారా రెండు దేశాలు వాణిజ్య వ్యాపారాలు సాగించడం శుభపరిణామమని అన్నారు. జలమార్గం ద్వారా తక్కువ సమయంలో కంటైనర్లతో అవసరమైన సామగ్రిని తీసుకెళ్లేందుకు ఓడరేవు వేదిక కావడం గర్వించతగ్గ విషయమని అన్నారు. రెండు దేశాల వాణిజ్యవ్యాపార కార్యకలాపాలతో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని కలక్టర్ అభిప్రాయపడ్డారు.
చిత్రం కృష్ణపట్నం పోర్టులో లంగరేసిన బంగ్లాదేశ్ నౌక. కృష్ణపట్నం పోర్టు నుంచి బంగ్లాదేశ్‌కు కంటైనర్ల ఎగుమతిని
ప్రారంభిస్తున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి. చిత్రంలో పోర్టు ప్రతినిధులు