రాష్ట్రీయం

పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. తన ప్రసంగంలో 2006 నుంచి ఇప్పటి వరకు ఎదురైన రాజ3కీయ అనుభవాల గురించి వివరించారు.
ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఓటర్ల నమోదు కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు తప్పని సరిగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల గ్రాంట్ వస్తుంది కాబట్టి వీలైనన్ని ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ భవన్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. సమావేశానంతరం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో నాయకుడు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠాగోపాల్, సుంకే రవి శంకర్, మైనంపల్లి హన్మంత రావు, పట్నం నరేందర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌లను రాష్ట్ర కమిటీ నుంచి రీలీవ్ చేసినట్లు చెప్పారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో
మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు