రాష్ట్రీయం

కేంద్రం వివక్షను ఇక ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 17: నిన్న తిత్లీ.. నేడు పెథాయ్ తరచు తుపాన్లు ముంచుకొస్తున్నా కేంద్రంలో చలనంలేదు.. మనం చెల్లించే పన్నులతో ఆదాయం వస్తున్నా బాధితులను ఆదుకోవటంలో వివక్ష చూపుతోంది.. ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పెథాయ్ తుపాను నష్టం అంచనాలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తుపాను కదలికలు గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకున్నందునే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. తుపాను కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులకు పూర్తిస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, కేంద్రం మానవతా దృక్పథంతో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మరింత మెరుగైన సేవలందించే వీలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీజీఎస్ వంటి పర్యవేక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే లేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను సంసిద్ధుల్ని చేయటం ద్వారా ఏపీని గ్లోబల్ కమ్యూనిటీకి రోల్‌మోడల్‌గా మారుస్తామని వెల్లడించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. అధికారులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధిని సాధించే కృషిలో నిమగ్నమవుతున్నారని ప్రశంసించారు. మాటలకు, చేతలకు తేడా ఉంటుంది.. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడానని నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలు రెండూ సఖ్యంగా ఉండాలని మాత్రమే తాను అభిలషించానని స్పష్టం చేశారు. అక్కడ టీఆర్‌ఎస్ గెలిస్తే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకోవటమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడలేదని, అడ్డం తిరగటంవల్లే వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలకు సంకేతమని విమర్శించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేయటం వల్లే ప్రజాగ్రహానికి గురవుతోందని చెప్పారు. పెద్దనోట్లు రద్దుచేయాలని ఏనాటి నుంచో కోరుతున్నా.. డిజిటల్ కరెన్సీకి వెళ్లడం ద్వారా అవినీతికి అరికట్టాలని ప్రతిపాదించా.. ఒక పెద్దనోటు తీసి మరో పెద్దనోటును అమల్లోకి తెచ్చారని వ్యాఖ్యానించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ప్రపంచంలో ఎవరూ వినియోగించటంలేదని తెలిపారు. అది చిప్ ఆధారిత మిషన్.. దాన్ని సులభంగా ఏ మార్చే అవకాశం ఉంది.. ప్రజాస్వామ్యం కొంత మంది చేతిల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కేసు 3, 4 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈవీఎంలో డేటా అన్ని రోజులు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్‌కు వెళుతుంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు ఎందుకెళ్లాలని నిలదీశారు. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా ఈవీఎంల గురించి చెబుతున్నా.. ఈ విధానం ఫలితాన్ని తేలిగ్గా తారుమారు చేసేందుకు వీలయ్యేదని తెలిపారు. పేపర్ బ్యాలెట్ వల్ల నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికలను కూడా ఇదే తరహాలో నిర్వహించేందుకు ఉద్యమిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడిన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇక్కడి ప్రతిపక్ష వైసీపీ, జనసేన అక్కడ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. వీటన్నింటిపై త్వరలో శే్వతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాస్తవ స్థితిపై శే్వతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు. ఇప్పటి పరిస్థితులు, మార్పులు వివరిస్తూ మరోసారి శే్వతపత్రాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించింది. కేసీఆర్‌కు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది.. అలాంటి పార్టీని తెలంగాణలో ఉండటానికి వీల్లేదనటం ఎంత వరకు సమంజసమన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు