రాష్ట్రీయం

ఖమ్మం ఎమ్మెల్యేలే టార్గెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించగా అందులో 6 స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచినవే. 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనతో ఖమ్మం జిల్లాలో గెలిచిన శాసన సభ్యులపై అందరి దృష్టి పడింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భిన్నంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీలు విజయం సాధించాయి. ఇంకో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించి తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరగా మరో స్థానం టీఆర్‌ఎస్ ఖాతాలో పడింది.
వైరా నియోజకవర్గంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరడంతో కూటమి తరఫున గెలిచిన 8 మంది అభ్యర్థులపై అందరి దృష్టి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా 12 మంది తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన ఆరుగురి వైఖరిపై ఆంద్పుళన కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాలేరులో గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలంలో గెలిచిన పొడెం వీరయ్య తాము ఏ పార్టీలో చేరేది లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, సామాజిక మాధ్యమాల్లో తమపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటనలు చేశారు. కానీ పినపాకలో గెలిచిన రేగా కాంతారావు, ఇల్లెందులో గెలిచిన బాణోత్ హరిప్రియ ఎటువంటి ప్రకటన చేయలేదు.
మధిరలో గెలిచిన మల్లు భట్టివిక్రమార్క ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేయడమే కాకుండా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. కేసీఆర్ ప్రకటన ద్వారా టీఆర్‌ఎస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ టీఆర్‌ఎస్ నేతలతో కొందరు ఎమ్మెల్యేలు టచ్‌లోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ నేతలతో పాటు కొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా కాంగ్రెస్‌లో ఉండి ఏమీ చేయలేమని, ప్రజలు టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు ఇవ్వడంతో ఒకరిద్దరు కాంగ్రెస్‌లో ఉండి చేసేదేమి లేదని వ్యాఖ్యానిస్తుండటం కేసీఆర్ మాటలకు ఊతమిస్తోంది. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం లోపే వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరతారని వస్తున్న ప్రచారాన్ని పెద్దగా ఖండిస్తున్న నేతలు కూడా లేరు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన వారిలో మూడో వంతు ఒకేసారి కేసీఆర్ వద్దకు చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ సభ్యులను కాపాడుకునే బాధ్యతను జిల్లాకే చెందిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ శాసనసభ్యుల వ్యవహార శైలిపై నిఘా పెట్టినట్లు సమాచారం.